టి-సాట్ సీఈవో కార్యాలయంలో పోటీ పరీక్షలు మరియు నియామక పరీక్షలకు సంబంధించి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఆదె సత్యనారాయణ రచించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు జనరల్ స్టడీస్ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం.

విధ్యార్థుల భవిష్యత్తుకు పుస్తకం పునాది వేస్తుందని టి-సాట్ సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి అన్నారు. పోటీ పరీక్షలు మరియు నియామక పరీక్షలకు సంబంధించి తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ఆదె సత్యనారాయణ రచించిన సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు జనరల్  స్టడీస్ పుస్తక ఆవిష్కరణ  శైలేష్ రెడ్డి చేతులమీదుగా టి-సాట్ కార్యాలయంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా శైలేష్ రెడ్డి మాట్లాడుతూ పుస్తకాలు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించే టీఎస్పీఎస్సీ, ఏపీపీఎస్సీ  గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4  మరియు రెండు తెలుగు రాష్ట్రాల పోలీస్ రిక్రూట్ మెంట్  బోర్డులు నిర్వహించే  ఎస్సై కానిస్టేబుల్   వంటి పోటీ పరీక్షలకు  హారయ్యే అయ్యే అభ్యర్ధులందరికీ ఈ పుస్తకాలు  ఉపయోగపడతాయని అన్నారు. ఇస్రో నిర్వహించే స్పేస్ వీక్, కేంద్ర స్థాయిలో నిర్వహించబడే విద్యార్ధి వైజ్ఞానిక్ మంధన్ వంటి టాలెంట్ టెస్టులకు ఈ పుస్తకం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. సైన్స్ అండ్ టెక్నాలజికీ ప్రాధాన్యత పెరిగినందున పాఠశాల స్థాయి విద్యార్థులకు సైతం ఈ పుస్తకం చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు. పుస్తక రచయితను ప్రత్యేకంగా అభినందిస్తూ విద్యార్థులకు ఉపయోగపడే మరిన్ని పుస్తకాల రూపకల్పనలో పాలుపంచుకోవాలని కోరారు. రచయిత ఆదె సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ పుస్తకాలు రచించడమే కాకుండా పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు టి-సాట్ ద్వార సేవలందించారని కొనియాడారు. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో సంపాదకులు ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ బి. అప్పారావు, టి-సాట్ ప్రొగ్రాం ప్రొడ్యూసర్నంద్యాల భూపాల్ రెడ్డి, రాష్ట్రోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గణపురం భీమయ్య, కొనకంచి వీరరాఘవులు పాల్గొన్నారు.

Share This Post