టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-CBRT ఎగ్జామినేషన్ 7-11-2022


పత్రికా ప్రకటన:-
సిద్దిపేట 03 నవంబర్ 2022

టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-CBRT ఎగ్జామినేషన్ 7-11-2022 సోమవారం రోజున ఉదయం 10-00 నుండి 12:30 వరకు మరియు మధ్యాహ్నం 2:30 నుండి 5-00 గంటల వరకు పరిక్ష నిర్వహించనున్నారు. సిద్దిపేట జిల్లా లో ఓకే ఒక సెంటర్ ఇందూరు ఇన్స్టిట్యూట్ ఆప్ ఇంజనీరింగ్ కళాశాలలో పరిక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్ల పై గురువారం కలెక్టరేట్ సముదాయం లో జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశం లో అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-CBRT ఎగ్జామినేషన్ సంబంధించి ఒకే ఒక సెంటర్ ఉన్నందున పరీక్ష పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ, రవాణా, పోలిస్, వైద్య శాఖ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని పరీక్షలు నిర్వహణ టిఎస్పిఎస్సి నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మహేందర్, డిఆర్ఓ చెన్నయ్య, డిఎమ్ఎచ్ఒ కాశీనాథ్, కలెక్టరేట్ ఏవో అబ్దుల్ రహమాన్, తదితరులు పాల్గొన్నారు.
issued by Dist public Relation office Siddipet

Share This Post