టీఎస్ ఐపాస్ పై సమావేశం

కలెక్టర్ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కమిటీ సమావేశం నిర్వహించి అనుమతులకు ఆమోదం తెలిపారు. స్వయం ఉపాధి కింద రుణాలు పొందే ఎస్సీ, ఎస్టీలకు 35 శాతం సబ్సిడీ మంజూరు చేయడం జరుగుతుందని, ఈ అవకాశాలను ఎస్సీ , ఎస్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సమావేశంలో ఎస్సీలకు 12 అనుమతులు ఇవ్వగా అందులో , ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వెహికల్స్ 08 , గూడ్స్ కారియర్స్ 02 , మోటార్ క్యాబ్ 02 ఉన్నాయి. ఎస్ టి లకు 13 మంజూరు చేయగా , మోటార్ క్యాబ్స్ 02, ట్రాక్టర్ అండ్ ట్రైలర్ వెహికల్స్ 09 , గూడ్స్ కారియర్స్ 02 ఉన్నాయి. యూనిట్ మంజూరు చేయుటకు 35 శాతం సబ్సిడీ అందించుటకు ఆమోదం తెలిపినట్లు ఆయన వివరించారు. ఇప్పటికీ 1252 అనుమతులకు దరఖాస్తు చేసుకోగా 995 అనుమతులు జిల్లా పరిశ్రమల శాఖ ద్వారా జారీ చేయడం జరిగిందని ఆ శాఖతో పాటు రవాణా, పొల్యూషన్ కంట్రోల్, ఇతర శాఖల అనుమతులు కూడా ఎప్పటికప్పుడు నిర్ణీత సమయంలో జారీ చేయుటకు అధికారులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని మరోవైపు ప్రభుత్వ నిబంధనలు కూడా పాటించాలని ఆయన ఆదేశించారు.

ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా , జిల్లా పరిషత్ సీఈఓ గోవింద్ నాయక్ , డిఆర్డీఓ పిడి చందర్ నాయక్ , పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాబురావు ,ఎల్ డి ఎం శ్రీనివాస్ రావు , పిసిబి ఈఈ బిక్షపతి, యస్ సి కార్పొరేషన్ ఈ డి రమేష్ , యస్ టి కార్పొరేషన్ నగోరావు ,ఇతర శాఖల అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

Share This Post