టీకా తీసుకోని వారు అపోహలు వీడండి కోవిద్ టీకా తీసుకోండి – అసదుద్దీన్ ఒవైసి

            కోవిద్ టీకా విషయంలో అపోహలు వీడాలని వెంటనే టీకాను వేయించుకోవాలని హైదరాబాద్ ఎం పి అసదుద్దీన్ ఒవైసి పిలుపునిచ్చారు. నగరంలోని పాతబస్తీలో కోవిద్ టీకా వేసుకొని వారు అధిక శాతం ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ లెక్కలు చూపుతున్నాయని తెలిపారు. పాతనగరం సంతోష్ నగర్   డివిజన్ కు చెందిన కాలంధర్  నగర్ సామజిక భవనంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కోవిద్ టీకా కార్యక్రమం ప్రారంభ సమయంలో తాను మొదటి టీకా వేయించుకున్నా అన్నారు. తనతో బాటు ఎం ఐ ఎం బాద్యులు చాల మంది కోవిద్ టీకా రెండు డోసులు వేయించుకున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట కోవిద్ మరణాలు సంబవిస్తున్నాయన్నారు. యూరప్ రష్యా జర్మనీ దేశాల్లో ఎక్కువగా ఉన్నట్లు ఇప్పటికి సమాచారం ఉందన్నారు. ప్రపంచంలో ఈ మహమ్మారి ఎక్కడ ఉన్న తిరిగి ఇతర దేశాల పై విరుచుకుపడుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పాతనగరంలోని బస్తీల వారు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు ఇంటింటికి  తిరుగుతు సమాచారాన్ని సేకరిస్తున్నారని  వారికీ తప్పనిసరిగా సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేసారు. టీకా మొదటి డోసు వేసుకున్న తరువాత ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతు రెండవ డోసు  వేసుకొని వారి సమాచారం సేకరిస్తున్నారని వారికీ   స్థానికులు సహకరించాలన్నారు.

            ఈ కార్యక్రమంలో స్థానిక ఎం ఎల్ ఏ అహ్మద్ పాషా ఖాద్రి, జోనల్ కమీషనర్ సామ్రాట్, డి ఎం ఎచ్ ఓ డా వెంకటి, స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Share This Post