టీచింగ్ నుండి నాన్ టీచింగ్ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని విద్యా, గురుకుల, రెసిడెన్షియల్ అధికారులను జిల్లా కలెక్టర్ అనుదీప్ ఆదేశించారు.

వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఓమైక్రాన్ ముంపు తదితర అంశాలపై వైద్య, రెవిన్యూ, పంచాయతీ, మున్సిపల్ మండల సమాఖ్యల అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సిన్ మాత్రమే ముంపు నుంచి రక్షణ కల్పించగలదని, నిర్లక్ష్యంతో వ్యాక్సిన్ తీసుకోకపోవడం వల్ల వ్యాధి నుండి ప్రమాదం పొంచి ఉన్నదని, వ్యాక్సిన్ ప్రక్రియను నూటికి నూరు శాతం పూర్తి చేసి వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయినట్లు డిక్లరేషన్ చేయాలని చెప్పారు. జిల్లాలో ఇప్పటి వరకు 90 శాతం వరకు మొదటి డోస్ వ్యాక్సిన్ ప్రక్రియ పూర్తయినట్లు చెప్పారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరినీ కలెక్టర్ అభినందించారు. జిల్లాలో మొత్తం 794206 మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉండగా ఇప్పటి వరకు 714278 మందికి వ్యాక్సిన్ వేసినట్లు చెప్పారు. వ్యాక్సిన్ తక్కువగా జరిగిన మండలాల్లో ఆశా. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారిగా సమీక్ష నిర్వహించి ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. జిల్లా మొత్తం మీద దాదాపు 80 వేల మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకోని వారున్నారని, వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చి నూరు శాతం వ్యాక్సిన్ జరిగిన గ్రామాలు, మండలాలుగా ప్రకటించాలని చెప్పారు. డిసెంబర్ 10వ తేదీ వరకు నూరు శాతం వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితా ఆధారంగా ప్రత్యేక క్యాంపులు నిర్వహించి వ్యాక్సిన్ ప్రక్రియ చేపట్టాలని చెప్పారు. రెండవ డోస్ తీసుకోని వారిని గుర్తించి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ వేయాలని చెప్పారు. వ్యాక్సిన్ వేయడం చాలా ప్రాముఖ్యమైన పని అని, వ్యాక్సిన్ మాత్రమే వ్యాధి నుండి రక్షించగలదని అదే శ్రీరామరక్షని చెప్పారు. మహిళా సమాఖ్యల సమావేశాల్లో జాబితా ప్రకారం వ్యాక్సిన్ ప్రక్రియపై అవగాహన కల్పించాలని చెప్పారు. కార్యదర్శి నుండి తహసిల్దార్ వరకు వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితా ఉండాలని చెప్పారు. వ్యాక్సిన్ కొరత లేదని ప్రణాళిక ప్రకారం ప్రత్యేక వ్యాక్సినేషన్ కార్యక్రమం చేపట్టి పూర్తి చేయాలని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక మొబైల్ వ్యాక్సిన్ వాహనాలను వినియోగించుకుని వ్యాక్సిన్ ఇవ్వాలని చెప్పారు. నూరుశాతం వ్యాక్సిన్ జరిగినట్లు ధృవీకరణ చేసి డిక్లరేషన్ చేయాలని పేర్కొన్నారు. ఇంతవరకు ఒక్క గ్రామపంచాయతీలో కూడా నూరు శాతం జరిగినట్లు డిక్లరేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్ వేసుకోవడంలో అలసత్వం కానీ నిర్లక్ష్యం కానీ ఉండొద్దని, రెండు డోస్లు తీసుకుంటేనే వ్యాధి నుండి రక్షణ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్చ వాహనాలు ద్వారా గ్రామాలు, మున్సిపాల్టీలలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై ప్రజలకు అవగాహన కొరకు వినియోగించాలని చెప్పారు. గురుకులాలు, రెసిడెన్షియల్ వసతిగృహాల్లో విద్యార్థుల యొక్క ఆరోగ్య పరిరక్షణపై ఎప్పటికప్పుడు సమాచారం అందచేయాలని చెప్పారు. ఏదేని అస్వస్థతకు గురైన విద్యార్థుల యొక్క సమాచారం ఇవ్వాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవాల్సిన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామాల్లో వ్యాక్సిన్ ప్రక్రియను పూర్తి చేయుటకు ప్రత్యేక టీములను ఏర్పాటు చేసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. వ్యాక్సినేషన్ చేయుటలో సర్పంచులను కూడా భాగస్వాములను చేయాలని చెప్పారు. వ్యాక్సిన్ తీసుకోవడమే రక్షణ కవచమని, ప్రమాదం నుండి సురక్షితంగా ఉండాలంటే వ్యాక్సినేషన్ తప్పని సరిగా తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు వ్యాధి కారకులవుతారని వారి నుండి ఇతరులకు వ్యాధి వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సిన్ నమోదులో ఆన్లైన్ వ్యత్యాసం రాకుండా చూడాలని చెప్పారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వారిగా వ్యాక్సిన్ శాతాన్ని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తక్కువగా జరిగిన మండలాల వైద్యాధికారులు, తహసిల్దారులతో వేగవంతం చేయు విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ వేయించుకోవడం, వేయడం ప్రతి ఒక్కరి బాద్యతగా తీసుకోవాలని చెప్పారు.

 

ఈ వీడియో కాన్ఫరెన్సులో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, వైద్యాధికారి శిరీష, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జడ్పీ సీఈఓ విద్యాలత, అన్ని మండలాల తహసిల్దార్లు, యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post