టీబీ నిర్మూలనకు పక్కా కార్యాచరణ అమలు:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచురణార్థం…….1

తేదీ.20.3.2023

టీబీ నిర్మూలనకు పక్కా కార్యాచరణ అమలు:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

టీవీ నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు సమావేశాలు నిర్వహించాలి

టీబీ లక్షణాల పై ముఖ్యమైన కూడళ్లలో పోస్టర్లు అతికించాలి

టీబీ లక్షణాలు, చికిత్స పై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలి

టీబీ పేషెంట్లను ముందస్తుగా గుర్తిస్తే పూర్తి స్థాయిలో నయం చేయవచ్చు

టీబీ నిర్మూలన అంశంపై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మార్చి 20:-

2025 నాటికి టీబీ రహిత భారతదేశం గా తయారు చేయడమే లక్ష్యంగా మనమంతా పక్కా కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అన్నారు. టీబీ వ్యాధి నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యల పై సంబంధిత అధికారులతో తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

భారతదేశంలో 2008 సంవత్సరంలో పోలియో నిర్మూలించి పోలియో రహిత భారతదేశం గా రూపొందించుకున్నామని, అదేవిధంగా టీబీ నిర్మూలనకు మనమంతా కృషి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు.

టీబీ వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే చికిత్స అందించి నయం చేయవచ్చని, టీబీ ని విస్మరిస్తే మరొకరికి సోకే ప్రమాదం ఉందని కలెక్టర్ తెలిపారు. టీ.బీ లక్షణాలు గల వారిని గుర్తించేందుకు గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

గ్రామంలోని సర్పంచ్ వార్డు సభ్యులు పంచాయతీ కార్యదర్శి పాఠశాల టీచర్లు రేషన్ డీలర్లు అంగన్వాడీ కార్యకర్తలు మహిళా సంఘాల సభ్యులు, ఇతర ముఖ్య నాయకులు ప్రజాప్రతినిధులు ఇతర వర్గాల వారిని భాగస్వామ్యం చేస్తూ విస్తృతంగా టీబీ వ్యాధి లక్షణాలపై ప్రచారం చేయాలని కలెక్టర్ సూచించారు.

టీబీ నిర్మూలన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సిబ్బంది పాల్గొనాలని, జిల్లాలో ఉన్న 241 గ్రామ పంచాయతీలు, 30 మునిసిపల్ వార్డులలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.

టీబీ వ్యాధి లక్షణాలను వివరిస్తూ తెలుగు భాష లో, బొమ్మలతో కూడిన పోస్టర్లను ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ,అంగన్వాడి భవనం, పాఠశాల, ముఖ్యమైన కూడళ్లలో, జన సంచారం అధికంగా ఉండే ప్రదేశాల్లో అతికించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.

జిల్లాలో ఉన్న మహిళా సంఘాల సభ్యులు, పాఠశాలలో చదివే విద్యార్థులకు టీవీ వ్యాధి లక్షణాలు పట్ల అవగాహన కల్పించి ఆ వ్యాధి లక్షణాలు గల వారి వివరాలు సేకరించాలని, గ్రామంలో మున్సిపల్ వార్డులలో సమావేశాలు నిర్వహిస్తూ టీబీ పట్ల ఉన్న సామాజిక రుగ్మత నిర్మూలించేలా కృషి చేయాలని లక్షణాల గల వారికి గుర్తించి పరీక్ష నిర్వహించి చికిత్స అందించాలని కలెక్టర్ పేర్కొన్నారు.

జిల్లాలో గత రెండు, మూడు సంవత్సరాల రికార్డులను పరిశీలించి టీబీ కేసులు నమోదయ్య గ్రామాల పట్ల అధిక శ్రద్ధ వహించాలని, టీబీ వ్యాధిగ్రస్తులను సకాలంలో గుర్తించి, ఆన్లైన్ లో నమోదు చేసి, చికిత్స అందించాలని, ప్రతి మాసం వారికి 500 ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, డి ఆర్ డి ఓ పురుషోత్తం, జడ్పీ సీఈవో రఘువరన్, సిపిఓ శామ్యూల్ ,డిఈఓ రామ్ కుమార్, డి పి ఆర్ ఓ శ్రీధర్, డిపిఓ ఆశాలత , సంబంధిత అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు….

జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది….

Share This Post