టీబీ పై సామాజిక వివక్ష తొలగించే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

ప్రచురణార్థం-3 తేదీ.20.10.2021
టీబీ పై సామాజిక వివక్ష తొలగించే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల, అక్టోబర్ 20:- జిల్లాలోని ప్రజలకు టీబీ పై ఉన్న అపోహలు తోలగించాలని, సామాజిక వివక్ష తొలగించే దిశగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంభదిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి టిబీ ఫోరం సమావేశం నిర్వహించారు. క్షయ (టీబీ) వ్యాధి సంక్రమిస్తే అపోహలకు పోయి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దని, వెంటనే చికిత్స తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలను కోరారు. జిల్లాలో క్షయ వ్యాధి గ్రస్తులను గ్రామస్థాయిలో గుర్తించి వెంటనే చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. జ్వరం, ఆకలి లేకపోవడం బరువు తగ్గడం లక్షణాలు ఉంటే వెంటనే నిర్ధారణ పరీక్షలను దగ్గర్లోని ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చేస్తారని అన్నారు.పేద ధనిక తేడా లేకుండా క్షయ వ్యాధి వ్యాపిస్తుందని, ప్రతి వ్యక్తి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించడంతో పాటు వారికి నెలనెలా వచ్చే పోషణ భత్యం నగదును ఖాతాల్లో జమ చేయాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో 1030 మంది క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి వారికి చికిత్స అందించామని, అందులో 314 మంది కోలుకుంటున్నారని, 163 మందికి చికిత్స పూర్తి చేసామని, కేవలం 10 మంది మాత్రమే మరణించారని అధికారులు తెలిపారు. క్షయ వ్యాధి గ్రస్తులకు ప్రభుత్వం అందించే సహాయానికి 979 మంది అర్హులు అయినప్పటికీ 519 మంది వివరాలు మాత్రమే ఉన్నాయని, మిగిలిన వారి వివరాలు 4 రోజులో సేకరించాలని కలెక్టర్ తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్ధారణ కోసమే సామాగ్రి పై రాష్ట్ర స్థాయి అధికారులతో మాట్లాడుతానని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో ఒక్క కేసును కూడా వదలకుండా క్షయ వ్యాధి గ్రస్తులను గుర్తించి చికిత్స అందించాలని సిబ్బందిని ఆదేశించారు. క్షయ వ్యాధిగ్రస్తుల కుటుంబం సభ్యులకు సైతం పరీక్షలు చేయాలని పాజిటివ్ నమోదయితే వెంటనే చికిత్స అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. హెచ్ఐవి ,డయాబెటిస్, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు క్షయ పరీక్షలు పూర్తి చేయాలని, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో క్షయ వ్యాపిస్తుంన్నదున పోషకాహారం కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. 1030 మంది క్షయ వ్యాధిగ్రస్తుల లో 1012 మందికి హెచ్ ఐవీ ఉందని అధికారులు తెలిపారు. జిల్లాలోని హెచ్ఐవి తో బాధపడుతున్న పిల్లలకు పోషకాహారం అందేలా కృషి చేస్తానని కలెక్టర్ తెలిపారు. 100% ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రోగుల గుర్తింపులో అలసత్వం వహించవద్దని, గ్రామస్థాయిలో ఆశ, ఏఎన్ఎంలు, ఆరోగ్య సిబ్బంది క్షయ వ్యాధిగ్రస్తుల బ్యాంకు ఖాతాలు సేకరించి పోషణ భత్యం నగదు అందేలా చూడాలని ఆదేశించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పుప్పల శ్రీధర్, క్షయ నియంత్రణాధికారి డాక్టర్ ఎన్. శ్రీనివాస్, ప్రోగ్రాం అధికారులు డాక్టర్ సమీయోద్దీన్, శ్రీపతి, జిల్లా పంచాయతీ అధికారి నరేష్, వైద్యులు రాజ్ కుమార్, ధీరజ్ రావు, గీతిక ,వాణి, డి పి ఓ స్వామీ, డి పి పి ఎం హరీష్, హెచ్ ఈ భూమేశ్వర్, మురళి, ఎన్జీవో మమత, ఆరోగ్య సిబ్బంది, టీబి ఛాంపియన్లు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

టీబీ పై సామాజిక వివక్ష తొలగించే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ జి.రవి

Share This Post