టెట్ డ్యూటీలకు విధిగా హాజరు కావాలి శిక్షణా తరగతులకు గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ …….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

టెట్ డ్యూటీలకు విధిగా హాజరు కావాలి
శిక్షణా తరగతులకు గైర్హాజరైన ఉద్యోగులకు నోటీసులు జారీ
…….. జిల్లా కలెక్టర్ హనుమంతరావు

ఈ నెల 12న నిర్వహించనున్న టెట్(టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష కు డ్యూటీ వేసిన ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరు కావాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు తెలిపారు.

జూన్ 7న (మంగళవారం) నిర్వహించిన శిక్షణ తరగతులకు హాజరు కాని ఇద్దరి ఉద్యోగులకు నోటీసులు జారీ చేశామని ఆయన తెలిపారు.

7న శిక్షణా తరగతులకు గైర్హాజరైన ఉద్యోగులు ఈనెల 9న (గురువారం) కలెక్టరేట్లో ఉదయం 11 గంటలకు నిర్వహించు శిక్షణ తరగతులకు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేశారు. లేని యెడల శాఖాపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు.

Share This Post