టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు.

టెట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల సంబంధిత అధికారులకు సూచించారు.
మంగళవారం మద్గుల్ చిట్టెంపల్లి డి పి ఆర్ సి భవన్ లో టెట్ పరీక్ష నిర్వహణపై చీఫ్ సూపరింటెండెంట్స్, శాఖ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ టెట్ పరీక్ష చాలా కాలం తర్వాత నిర్వహించడం జరుగుతుందని, అభ్యర్థులు టెట్ ఉత్తీర్ణత పొందాలని అభిలాషతో ఉంటారని అన్నారు. అభ్యర్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయం కాబట్టి వారికి ఎటువంటి సమస్యలు కలుగకుండా పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరీక్ష నిర్వహణ కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా జిల్లా విద్యాశాఖ అధికారికి లేదా తనకు స్వయంగా ఫోన్ ద్వారా కానీ మెసేజ్ రూపంగా కానీ తెలియజేయాలని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలను ముందుగానే పరిశీలించి అక్కడి ఏర్పాట్లను చూసుకోవాలని తెలిపారు పరీక్ష కేంద్రాలకు సెల్ ఫోన్లు ఆపిల్ వాచెస్ ఎలక్ట్రానిక్ సామాగ్రిని అనుమతించకూడదని కలెక్టర్ అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణకు జిల్లాలో 24 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి పరీక్ష కేంద్రంలో 240 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా ప్రతి గదిలో 24 మంది అభ్యర్థులు ఉండేవిధంగా చర్యలు చేపట్టడం జరిగిందని ఆమె అన్నారు. ఈ నెల 12న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించే మొదటి పేపర్ పరీక్షకు 5730 మంది అభ్యర్థులు హాజరు కావడం జరుగుతుందని అదేవిధంగా మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించే రెండవ పేపర్ పరీక్ష కు 3745 మంది అభ్యర్థులు హాజరవుతున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 7 మంది దివ్యాంగ అభ్యర్థులు టెట్ పరీక్షలకు హాజరవుతున్నట్లు ఆమె తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించబడదని కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి, ఏసిజిఇ ప్రభు, ఏడి ఎం.ఎ.ఘని, డిసిఇబి కార్యదర్శి అనంత రెడ్డి, తాసిల్దార్ లు ఎంఇఓ లు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు

Share This Post