టెట్ పరీక్ష నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు…. జిల్లా కలెక్టర్ కె. శశాంక

టెట్ పరీక్ష నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు…. జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

టెట్ పరీక్ష నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు…. జిల్లా కలెక్టర్ కె. శశాంక.

మహబూబాబాద్, జూన్ -2:

ఈ నెల 12న నిర్వహించనున్న టెట్ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ కె. శశాంక సంబంధిత అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ నిర్వహణపై జిల్లా కలెక్టర్ కె. శశాంక అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ తో కలిసి సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి సమీక్షించారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పరీక్ష మొదటి, రెండు పేపర్ లు పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి పరీక్షా కేంద్రంలో వైద్య అధికారులు అందుబాటులో ఉండాలని, ఆర్టిసి ద్వారా పరీక్ష రోజు సంభందిత రూట్ ల నుండి బస్సులు వేళకు వచ్చే విధంగా సమన్వయం చేసుకోవాలని, స్ట్రాంగ్ రూం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పరీక్షా కేంద్రంలోకి వెళ్ళే సమయంలో క్షుణ్ణంగా తనిఖీ చేసి పంపాలని, ప్రశ్నపత్రాలు తరలించే సమయంలో బందోబస్తు అవసరం మేరకు ఏర్పాటు చేయాలని, పరీక్ష సమయంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

పదవ తరగతి పరీక్షలు విజయవంతంగా నిర్వహించినందుకు అడిషనల్ కలెక్టర్, డి.ఈ. ఓ. ను ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అభినందించారు.

అంతకుముందు జిల్లా విద్యా శాఖాధికారి ఎం.డి. అబ్దుల్ హై టెట్ పరీక్షా వివరాలు తెలుపుతూ, ఈ నెల 12 న ఉదయం 9-30 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 2-30 నుండి 5 గంటల వరకు టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. టెట్ పరీక్షలో మొదటి పేపర్ కు 26 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, 6159 మంది పరీక్ష రాయనున్నారని, అలాగే రెండవ పేపర్ కు 23 సెంటర్ లలో 5270 మంది పరీక్ష రాయనున్నారని, మొదటి పేపర్, రెండవ పేపర్ పరీక్షకు ఏర్పాటు చేసిన చీఫ్ సూపరింటెండెంట్ లు, డిపార్ట్మెంటల్ అధికారులు, రూట్, అడిషనల్ రూట్ ఆఫీసర్లు హాల్ సూపరింటెండెంట్ లు, ఇన్విజిలేటర్ ల వివరాలను తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం డేవిడ్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.డి.అబ్దుల్ హై, జిల్లా డిప్యూటీ డి.ఎం.అండ్ హెచ్. ఓ. అంబరీష, డి టి ఓ (ట్రెజరీ), డి.ఈ.- విద్యుత్, ఆర్టిసి డి.ఎం., జాయింట్ కస్తోడియన్, తదితరులు పాల్గొన్నారు.

————————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనదీ.

Share This Post