టెలి మెడిసన్ ద్వారా సులభంగా స్పెషలిస్ట్ డాక్టర్ల సూచనలు – కలెక్టర్

టెలి మెడిసన్ సదుపాయంతో జిల్లా ప్రజలు పి హెచ్ సి నుండే స్పెషలిస్ట్ డాక్టర్ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిందని జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి తెలిపారు.

సోమవారం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో టెలిమెడిసిన్ సదుపాయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లా ప్రజలందరికీ ఈజీగా స్పెషలిస్ట్ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అందించిన మంచి కార్యక్రమం టెలీ మెడిసిన్ అన్నారు. పి.హెచ్.సి, సి హెచ్ సి నుండే పేషెంట్లు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి రావలసిన అవసరం లేకుండా వారి సమస్యలు తెలియ చేసినట్లయితే సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్లు పేషెంట్ కు సంబంధించిన అన్ని పరీక్షలు చేసిన తర్వాత వారికి మందులు ఏ విధంగా వాడాలో తెలియజేస్తారన్నారు.

ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న జిల్లా ప్రజలకు ఇది మంచి అవకాశమని నిజామాబాద్ వరకు రావలసిన అవసరం లేకుండానే టెలీ మెడిసిన్ ద్వారా పేషెంట్ డాక్టర్ ను చూస్తూ మాట్లాడి వారికి ఉన్న సమస్యలు తెలియజేయవచ్చునని ప్రతి పి హెచ్ సి లో టెలి మెడిసన్ యొక్క షెడ్యూల్ను ఫ్లెక్సీ రూపంలో ప్రజలకు తెలిసే విధంగా ప్రదర్శించాలని వైద్యాధికారులు సూచించారు. ఏ రోజు ఏ డాక్టర్ అందుబాటులో ఉంటారో తెలుసుకుని వారు ఆరోజు పి హెచ్ సి కి వచ్చి అందుబాటులో ఉండే సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి జిల్లా ప్రజలందరూ కూడా పిహెచ్సి పరిధిలోనే ఎలాంటి ఇబ్బంది లేకుండా సీనియర్ డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకుంటూ మెడిసిన్ వాడడానికి అవకాశం ఉందని, ప్రతి ఒక్కరు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
పి హెచ్ సి కి వచ్చే పేషెంట్స్ అందరికీ కూడా వారికి ఉన్న ఇబ్బందులను ముందుగా గుర్తించి డాక్టర్స్ ముందుగా అవసరమైన సూచనలు చేయాలని, షెడ్యూల్ ప్రకారం గా రోజు వచ్చినట్లయితే ఆ రోజు స్పెషలిస్ట్ డాక్టర్తో మాట్లాడి మెడిసిన్ పొందవచ్చన్నారు.

రానున్న రోజుల్లో అన్ని పీహెచ్సీలలో ఈ సర్వీస్ ఎఫెక్టివ్ గా ఉపయోగించుకునే విధంగా మెడికల్ స్టాప్ చర్యలు తీసుకోవాలని జి జి హెచ్ లో కూడా మంచి సర్వీస్ ఇస్తున్నారని పి హెచ్ సి వరకు కూడా పేషెంట్కు సర్వీస్ అందించడానికి అవకాశం కలిగిందని జిజిహెచ్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఈ సేవలను సిస్టమేటిక్ గా అందించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. జిజిహెచ్ అందులో ముందుంటుందని కోరుకుంటున్నానని అన్నారు. మీరు అందించే సేవలు నిరుపేదలకని గుర్తుంచుకోవాలని మీరు రెండు గంటలు ఎఫెక్టివ్ గా చేస్తూ పేషెంట్లకు మంచి మెడిటేషన్ అందే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అనంతరం క్రో మిషన్ కు పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ Dr ప్రతి మారాజ్,

డిప్యూటీ సూపరింటెండెంట్ Dr బాలరాజు, ఇంచార్జ్ డి ఎం హెచ్ ఓ Dr సుదర్శనం, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ తుకారాం రాథోడ్, డాక్టర్ వెంకన్న, డా. జలగం తిరుపతిరావు, డాక్టర్ విశాల్, డాక్టర్స్ సరస్వతి, జయ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Share This Post