టెస్టుల వివరాలు పేషెంట్లకు తెలియాలి… జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ప్రచురణార్థం

టెస్టుల వివరాలు పేషెంట్లకు తెలియాలి…

మహబూబాబాద్ జూలై 7:

జిల్లాలోని మారుమూల ప్రాంతాల నుండి సేకరిస్తున్న టెస్టులు పరీక్షించడం మే కాక వాటి వివరాలను పేషెంట్లకు తెలియజేయాలని జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్ తెలిపారు.

బుధవారం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ పనితీరును కలెక్టర్ ఆకస్మిక సందర్శించి పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల ప్రజలు జిల్లా కేంద్రానికి రాకుండానే వివిధ రకాల టెస్టుల ఫలితాలను స్థానిక పి.హెచ్.సి ద్వారానే తెలుసుకోవచ్చని అంతేగాక టెస్టుల ఫలితం వచ్చినట్లు సెల్ కు మెసేజ్ వస్తుందని పేషెంట్ గ్రహించాలన్నారు పేషెంట్లు టెస్ట్ ల కొరకు ఇచ్చే శాంపిల్స్ స్థానిక పి ఎస్ సి ద్వారా పంపించు కో వచ్చునని పట్టణానికి రావాల్సిన అవసరం లేదన్నారు. పేషెంట్లు తమ శాంపిల్స్ ఇచ్చేటప్పుడు పూర్తి వివరాలు ఇవ్వవలసి ఉంటుందని సెల్ నెంబర్ కూడా పేషెంట్ దే ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు.

జిల్లాలో పేషెంట్ల నుండి 11 వేల శాంపిల్స్ సేకరించగా నాలుగు వేల మంది కి పరీక్షల సమాచారం పొందడం అందుకనుగుణంగా వైద్యం పొందడం జరిగిందన్నారు ఈ ప్రక్రియ ద్వారా నిరుపేదలకు మారుమూల ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి వచ్చే ఇబ్బందులు ఉండవని స్థానికంగానే పి.హెచ్.సి ద్వారా సమాచారం పొందవచ్చునన్నారు పేషెంట్లకు ధనము వృధా కాదని అదేవిధంగా సమయం కూడా ఉంటుందని తెలిపారు గంగారం మండలం లోని గంగారం కోమట్ల గూడెం పేషంట్ల నమూనాలను నర్సంపేట కు పంపరాదనిజిల్లా కేంద్రానికి పంపే విధంగా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు వర్షాకాలం సమీపించి నందున అంటు వ్యాధులు సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మలేరియా డెంగ్యూ వంటివి జ్వరాల బారిన పడకుండా నమూనాలను వెంటనే పంపించి వైద్యం పొందాలన్నారు.

ఈ కార్యక్రమంలో లో జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు ఉప వైద్యాధికారి అంబరీష డాక్టర్ రమేష్ ఏరియా హాస్పిటల్ పర్యవేక్షకులు వెంకటరమణ ఆర్ టి పి సి ఆర్ ల్యాబ్ మేనేజర్ అనురాధ కంప్యూటర్ ఆపరేటర్ వరప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్ అక్బర్ బాషా తదితరులు పాల్గొన్నారు.
———————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post