ప్రచురణార్థం:
ములుగు జిల్లా (వాజేడు)
తేది 31.07.2021
శనివారం రోజున జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఏటూరునాగారం ఐటీడీఏ పీవో హనుమంత్ జెండగే, భద్రాచలం పీవో గౌతం, అదనపు కలెక్టర్ ఆదర్శ సురభి గార్లతో కలిసి,వాజేడు మండలం ను సందర్శించారు . ఈ సందర్శన లో బాగంగా గోదావరి పరివాహక ప్రాంతం వాజేడు గతంలో ముంపుకు గురి ఐన టేకుల గూడెం గ్రామాన్ని సందర్శించారు. కొత్త గా నిర్మితం అవుతున్న తుపాకుల గూడెం బ్యారేజి అవతలి ఒడ్డును పరిశీలించారు . మండలం లోని వైద్యఅధికారులను అక్కడి ప్రజల పరిస్తితిని అడిగి తెలుసుకున్నారు. కరోనా టెస్ట్ లు,టికాలు, మలేరియ, డెంగు జ్వరాల గురించి, ఇంటింటి జ్వర సర్వేలో రోజుకు ఎన్ని ఇండ్లను సర్వే చేస్తున్నారు అనే దాని పైన ,మరియు కరోనా నిర్మూలనలో తీసుకుంటున్న జాగ్రత్త చర్యల గురించి వైద్య అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పల్లె ప్రగతి పనులలో బాగంగా పల్లె ప్రకృతి వనాల అభివృద్ది , వైకుంట దామాలు ,డంపింగ్ యార్డ్ , పనుల వివరాలను జిల్లా కలెక్టర్ గారు సంబందిత ఎంపిడిఓ చంద్ర శేఖర్ ని అడిగి తెలుసుకున్నారు.తెలంగాణకు హరితహారంలో రోడ్డుకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్ ద్వారా పెద్ద మొక్కలను నాటలని వారు అన్నారు.
ఈ పర్యటనలో, తాసిల్దార్ శ్రీనివాస్, ఆర్ ఐ మురళి కృష్ణ , గ్రామ సర్పంచ్ వాసం కృష్ణవేణి ,పంచాయితి సెక్రెటరి వినోద , తదితర సంబందిత అధికారులు పాల్గొన్నారు.
—————————————————————————————–
డిపిఆర్ఓ ములుగు జిల్లా గారిచే జారీ చేయడమైనది.