టైం లిమిట్ లో నిర్మాణాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

 

టైం లిమిట్ లో నిర్మాణాలను పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

జిల్లాలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను నిర్ధేశిత సమయంలోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

శుక్రవారం కలెక్టరేట్ మినీ మీటింగ్ హల్ లో సంబంధిత శాఖ అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఎస్సీ వసతి గృహాల నవీకరణ, గంభి రావు పేట లో భవిత సెంటర్, ఉప ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడి కేంద్రాల నిర్మాణం ఎల్లా రెడ్డి పేట వృద్ధుల డే కేర్ సెంటర్, డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీలలో మౌలిక సదుపాయాలు తదితర అంశాల పురోగతి పై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులు, ఇంజనీర్ లతో సమావేశం నిర్వహించారు.

నిర్మాణ పనులు వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్ రావు, dwo లక్ష్మి రాజం, ఎల్లారెడ్డి పేట ఎంపిడివో చిరంజీవి , పంచాయితీ రాజ్ ఈ ఈ , తదితరులు పాల్గొన్నారు.

Share This Post