టైక్వాండో ఇన్నర్ లను అభినందించిన అదనపు కలెక్టర్

విద్యార్థులకు చదువుతోపాటు మార్షల్ విద్యను కూడా ప్రావీణ్యం అవసరం అని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

సోమవారం ప్రగతి భవన్ లో నిజామాబాద్ జిల్లాకు చెందిన ఏడుగురు క్రీడాకారులు హైదరాబాద్ ఎల్ బి నగర్ లో తైక్వాండో అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మాస్టర్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో అక్టోబర్ 31 న తైక్వాండో బ్లాక్ బెల్ట్ పరీక్షల్లో పాల్గొని బ్లాక్ బెల్ట్ పొందారు. వారు అడిషనల్ కలెక్టర్ ను కలెక్టరేట్ లో ఆ విద్యార్థులను అభినందించారు. విద్యతో పాటు టైక్వాండో, కరాటే ఇతర విషయాలను కూడా నేర్చుకుంటే వారికి ఇతరులకు రక్షణ కూడా ఉంటుందని జాతీయస్థాయిలో మంచి భవిష్యత్తు కూడా ఉంటుందని పేర్కొన్నారు. కోచ్ మనోజ్ కుమార్ ను అభినందించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Share This Post