టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలో నివసిస్తున్న కుడిచింతల బైలు గ్రామస్థులు స్వచ్చందంగా పునరావాసం కోరుకునే వారిని పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు

టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కోర్ ఏరియాలో నివసిస్తున్న కుడిచింతల బైలు గ్రామస్థులు స్వచ్చందంగా పునరావాసం కోరుకునే వారిని పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ అధికారులను ఆదేశించారు.  బుధవారం ఉదయం   సార్లపల్లి, కుడిచింతల బైలు గ్రామాన్ని అటవీ శాఖ, పి.ఓ ఐ.టి.డి.ఏ, రెవెన్యూ అధికారులతో కలిసి పునరావాసానికి సంబంధించి  అక్కడి ప్రజల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.  జాతీయ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ సూచనల మేరకు అక్కడ నివసించే చెంచులు, చెంచుయేతరులను పునరావాసం కల్పించేందుకు ఒక్కో కుటుంబానికి రూ. 15 లక్షల చొప్పున పునరావాస పరిహారం చెల్లించేందుకు ఉత్తర్వులు జారిచేయడం జరిగిందన్నారు.  అక్కడి ప్రజల అభిప్రాయం తీసుకొని అవగాహన కల్పించారు.  గ్రామ ప్రజలు తమ అభిప్రాయాలు తెలియజేస్తూ ఇక్కడ జీవించడానికి అవసరమైన సదుపాయాలు లేవని, అన్ని మౌళిక సదుపాయాలు, డబుల్ బెడ్ రూమ్ , 5 ఎకరాల భూమి పరిహారం  ఎన్. టి.సి.ఏ ద్వారా కల్పించిన సదుపాయాలు కల్పిస్తే  స్వచ్చందంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళడానికి సిద్ధమే అని తెలిపారు. స్పందించిన జిల్లా కలెక్టర్   ఇక్కడి ప్రజల సోషియో ఏకనామికల్ సర్వే పకడ్బందీగా నిర్వహించాలని, వారికి ఉన్న ఆస్తిపాస్తులు, జీవరాశుల గణన పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.  స్వచ్చందంగా పునరావాస కేంద్రాలకు తరలివచ్చే కుటుంబాలకు పునరావాసాల్లో  పాఠశాల, తాగునీరు, రోడ్లు, వైద్యం తదితర అన్ని మౌళిక వసతులు కల్పించడం జరుగుతుందని తెలియజేసారు.

ఈ కార్యక్రమంలో ఎఫ్.డి.ఓ రోహిత్ రెడ్డి,  పి.ఓ.ఐ.టి.డి.ఏ అశోక్, పునరావాస సాధన సమితి సభ్యులు , గ్రామస్థులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post