ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లు ఓటరు నమోదులో పాల్గొనాలి.
జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్
000000
ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లు ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
బుధవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎలక్షన్ కమిషన్ సూచనల మేరకు ట్రాన్స్ జెండర్లు మరియు సెక్స్ వర్కర్లతో ఓటరు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా అందరిని భాగస్వాములను చేయాల్సిన బాధ్యత ఉందని, అందుకొరకు గాను ట్రాన్స్ జెండర్లు, సెక్స్ వర్కర్లను కూడా ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనేలా చేయాలని అన్నారు. ప్రతి ఒక్క ట్రాన్స్ జెండర్ కూడా ఓటరు కార్డు కలిగి ఉండాలని, ఇప్పటికే ఉన్నవారు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, ఓటర్ కార్డులో మార్పులు చేర్పులు ఉన్నట్లయితే సవరణలు చేసుకోవచ్చని కోరారు. డిసెంబర్ 3 , 4వ తేదీలలో పోలింగ్ స్టేషన్లలో బూత్ లెవెల్ అధికారులు అందుబాటులో ఉంటారని ఫామ్6 ఫామ్6బి లను అక్కడ ఇవ్వవచ్చని, ఇతర సవరణలకు అప్లై చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు .
ఈ సందర్భంగా ఓటరు నమోదు పత్రాలను జిల్లా ఎన్నికల విభాగం ట్రాన్స్ జెండర్లు,సెక్స్ వర్కర్లకు అందజేశారు.
ఈ సమావేశంలో జడ్పీ సీఈఓ ప్రియాంక, స్వీప్ నోడల్ అధికారి మెప్మా పిడి రవీందర్, జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి జువెరియా, తహసిల్దార్ సుధాకర్, టౌన్ మిషన్ కోఆర్డినేటర్ అనిత, సఖి నిర్వాకురాలు లక్ష్మీ, సెక్స్ వర్కర్ ల సంక్షేమ ఎన్జీవో విజయలక్ష్మి, ట్రాన్స్ జెండర్ ల నాయకురాలు ఆశ తో పాటు 30 మంది ట్రాన్స్ జెండర్లు పాల్గొన్నారు.