ట్రైకార్, గిరి వికాసం, పథకాలను వేగవంతం చేసి లబ్ధిదారులందరికి త్వరితగతిన పథకాలను అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు, 28 ఖమ్మం:

ట్రైకార్, గిరి వికాసం, పథకాలను వేగవంతం చేసి లబ్ధిదారులందరికి త్వరితగతిన పథకాలను అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ భద్రాచలం ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రుతో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2014-15 ఆర్ధిక సంవత్సరం నుండి 2017-18 వరకు ట్రైకార్ పథకం క్రింద మంజూరు చేసిన పథకాల గ్రౌండింగ్ చేసిన యూనిట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్స్, దృవీకరణ ఫోటోలను సెప్టెంబరు 13 నాటికి సమర్పించాలని లీడ్ బ్యాంక్ మేనేజర్, వివిధ బ్యాకుంల మేనేజర్లను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరానికి మంజూరు చేసిన 17 కోట్ల 96 లక్షల నిధులను జనాభా ప్రాతిపదికన మండలాల వారీగా విభజించి ఈ నెల 7,8,9 తేదీలలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్కు సూచించారు. గిరిజన లబ్ధిదారులందరికి గిరి వికాస్ పథకం క్రింద విద్యుత్, బోర్లు, మోటారులను సమకూర్చుటకు గాను ప్రభుత్వం 3 కోట్ల 47 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని పనులన్నింటిని త్వరతగతిన పూర్తి చేయాలని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిని, విద్యుత్ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. గిరిజన అటవీ ప్రాంతాలలో జిల్లా అటవీ శాఖ అధికారి, సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు.

సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, శిక్షణ కలెక్టర్ బి. రాహుల్, జిల్లా, పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అప్పారావు, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యాచందన, విద్యుత్ శాఖ ఎస్.ఇ. రమేష్, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్రావు, జిల్లా అటవీ శాఖాధికారి ప్రవీణ, జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి కృష్ణనాయక్, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post