ట్రైకార్ పథకం క్రింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

ట్రైకార్ పథకం క్రింద మంజూరైన యూనిట్ల గ్రౌండింగ్ కు చర్యలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. శుక్రవారం ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులు, బ్యాంకర్లతో ట్రైకార్ యూనిట్ల గ్రౌండింగ్ పై భద్రాచలం ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రూ తో కలిసి, కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గిరిజన యువత స్వయం ఉపాధికి, ఆర్థికంగా అభివృద్ధి చెందుటకు ట్రైకార్ క్రింద సబ్సిడీ తో యూనిట్ల మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్థిక మద్దతు పథకం క్రింద 451 యూనిట్ల లక్ష్యం కాగా, 221 యూనిట్లు ఇప్పటి వరకు మంజూరు కాగా, ఎంపిడిఓ వద్ద 25, బ్యాంకర్ల వద్ద 28 ఉండగా, పరిపాలనా అనుమతుల కొరకు 198 యూనిట్లు సమర్పించినట్లు ఆయన తెలిపారు. గ్రామీణ రవాణా ప్రణాళిక క్రింద 62 యూనిట్ల లక్ష్యం ఉండగా 55 యూనిట్లు మంజూరు చేశామన్నారు. 53 యూనిట్లకు సబ్సిడీ విడుదల చేయగా, ఇప్పటి వరకు 41 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయినట్లు ఆయన తెలిపారు. మిగులు యూనిట్ల గ్రౌండింగ్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గ్రౌండింగ్ పూర్తయిన యూనిట్లకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు సమర్పించాలన్నారు. లబ్ధిదారులు యూనిట్లను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి చెందేలా అవగాహన కల్పించాలన్నారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక8సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీవో విద్యాచందన, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కృష్ణా నాయక్, ఎల్డిఎం శ్రీనివాస రెడ్డి, బ్యాంకర్లు తదితరులు.

Share This Post