ట్రైబల్ వెల్ ఫెర్ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించిన ఆర్టీఐ కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్

జనగామ, సెప్టెంబర్ 17: ఆర్టీఐ కమీషనర్ డా. గుగులోతు శంకర్ నాయక్ శుక్రవారం జిల్లాలో పర్యటించారు. ట్రైబల్ వెల్ ఫెర్ మహిళా డిగ్రీ కళాశాలను సందర్శించారు. కళాశాలలో విద్యార్థినులతో అందుతున్న వసతులను గురించి అడిగి తెలుసుకున్నారు. డార్మెటరీ, తరగతి గదులు, టాయిలెట్లు, పరిసరాలను పరిశీలించారు. చదువుతోనే ఉన్నత స్థానమని, ఇష్టంగా చదివి లక్ష్యం చేరుకోవాలని అన్నారు. విద్యార్థినులకు ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. విద్యార్థినులతో ఆర్టీఐ కమీషనర్ సహపంక్తి భోజనం చేశారు.
ఈ సందర్భంగా జనగామ మండల తహసీల్దార్ రవీందర్, కళాశాల వార్డెన్ తదితరులు ఉన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post