ట్విట్టర్ వేదికగా స్పందించి ఆదుకున్న కలెక్టర్

వరంగల్ జిల్లా చెన్నారావు పేట్ మండలం జల్లి గ్రామానికి చెందిన గందం సరిత బుద్ధిమాంద్యం కలిగిన సమస్య ఉంది. తండ్రి తన చిన్నతనంలోనే మరణించాడు. తల్లి వృద్ధాప్యంలో ఉంది.

చెన్నారావుపెట్ కు చెందిన తడక అనిల్ శారీరక దివ్యాంగుడు ఇతని తల్లిదండ్రులు చిన్నతనంలో వదిలి వెళ్లడంతో తన నానమ్మ కొమురమ్మ పర్యవేక్షణలో పెరిగాడు.

అనిల్ కు సరితతో 2015 లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం 4 సం లు, నానమ్మ వృద్ధాప్యంలో ఉంది తనకు వచ్చే పెన్షన్ తన ఔషధాలు ఖర్చులకు సరిపోతుంది.

సరిత, అనిల్ కు సదరం పెన్షన్ రావడంతో కేవలం పెన్షన్ మీదనే కఆధారపడి జీవిస్తున్నారు.

స్నేహితుల సహకారంతో చేన్న రావు పేట గ్రామంలో ఒక రేకుల షెడ్డు ను నిర్మించడం జరిగింది దాంట్లోనే నానమ్మ , సరిత, అనిల్, వారి పాప నివసిస్తున్నారు.
గతంలో మహిళా శిశు సంక్షేమ శాఖ తరఫున అనిల్ కు మూడు చక్రాల సైకిల్ అందించడం జరిగింది.

సరితకు అంగన్వాడీ కేంద్రం ద్వారా పోషక ఆహారం, ఇతర సేవలు అందించారు, అనంతరం వారి కూతురు కూడా స్థానిక అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేయించి పూర్వ ప్రాథమిక విద్య లో నమోదు చేయించడం జరిగింది.

అయితే 2019 ఫిబ్రవరి నుండి సరిత కు రావలసిన పెన్షన్ రావడం లేదు సదరం సర్టిఫికెట్ లో సదరం సర్టిఫికేట్ లో రెన్యువల్ లో వైకల్యం పెన్షన్ అర్హత కంటే తక్కువగా ఉండటం వలన తనకు పెన్షన్ ఆగిపోయిందని అధికారుల విచారణ లో తేలింది.

అనిల్ కు వచ్చే పెన్షన్ ఆధారం కావడం, సరిత పెన్షన్ ఆగిపోవడంతో ఆర్థికంగా ఇంట్లో తీవ్రమైన ఇబ్బంది ఏర్పడింది.

ఈ క్రమంలో వీరి మిత్రుడు ట్విట్టర్ వేదికగా వరంగల్ కలెక్టర్ గారికి ఇద్దరూ సరిత, అనిల్ వైకల్యంతో బాధపడుతున్నారు అని పాప ఉందని, వృద్ధాప్యం లో నానమ్మ అనిల్ పై ఆధారపడి జీవిస్తున్నారని, తగిన సహాయం చేసి ఆదుకోవాలని పోస్ట్ చేయడం జరిగింది.

మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి ఎం.శారద, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సంపత్ రావు జిల్లా బాలల సంరక్షణ అధికారి జి. మహేందర్ రెడ్డి వెంటనే తగిన విధంగా సహాయం చేయాలని, నివేదిక సమర్పించాలని ఆదేశించారు, త్వరలో సరిత కు సదరం సర్టిఫికెట్ కొరకు రీ అసెస్మెంట్ కు పంపుతామని, డి.ఆర్.డి ఓ తెలిపారని అధికారులు తెలిపారు.

అనిల్, సరిత కుటుంబానికి అండగా ఉండాలని పూర్తి వివరాలు తెలుసుకొని నివేదిక సమర్పించాలని ఆదేశించారు.

కలెక్టర్ ఆదేశాలతో గురువారం రోజున జిల్లా బాలల సంరక్షణ అధికారి జి. మహేందర్ రెడ్డి చెన్నారావు పెట్ గ్రామానికి చేరుకొని సరిత, అనిల్, వారి నాన్నమ్మ మరియు పాప తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకోవడం జరిగింది మరియు వారు నివాసం ఉంటున్న పరిస్థితులపై కుటుంబ సభ్యులను కూడా ఆరా తీయడం జరిగింది.వారి దయనీయ గాథ కలెక్టర్ కు వివరిస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి జి.మహేందర్ రెడ్డి తెలిపారు.

పదిహేను వందల ర రూపాయల విలువ కల్గిన 16 రకాల నిత్యవసర వస్తువులు సరిత అనిల్ కు అందించి కలెక్టర్ గారికి పూర్తి నివేదిక అందజేస్తామని జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్ రెడ్డి తెలిపారు.

పాపకు సంబదించి ప్రబుత్వం తరుపున కలెక్టర్ గారి ఆదేశానుసారం తగిన సహాయం చేస్తామని ఆయన అన్నారు.

చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ కె.వసుధ మాట్లాడుతూ కలెక్టర్ గారి సూచనతో సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ మంజుల, డి.సి.పి.యూ స్టాఫ్ ఔట్ రీచ్ వర్కర్ ఆర్. సుమన్, స్థానిక అంగన్వాడీ టీచర్ దేవమ్మ, వార్డు సభ్యులు సతీష్ తదితరులు పాల్గొన్నారు. స్పందించిన కలెక్టర్ మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Share This Post