డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలలో మౌళిక వసతుల ముగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు.

ప్రచురణార్ధం

ఆగష్టు 09 ఖమ్మం:

డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయాలలో మౌళిక వసతుల ముగింపు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అధికారులను, గుత్తేదారులను ఆదేశించారు. నగరంలోని టేకులపల్లి డబుల్ బెడ్రూమ్ గృహసముదాయాల పనులను సోమవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గృహసముదాయాలలో ఇంకనూ కొన్ని బ్లాక్లలో మౌళిక వసతుల పనులు పూర్తి చేయకపోవడం పట్ల గుత్తేదారులను, అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. సానిటేషన్, ఫ్లోరింగ్, విద్యుత్ సరఫరా వంటి పనులను వేగవంతం చేసి త్వరగా. పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే పూర్తయిన గృహసముదాయాలతోపాటు ప్రస్తుతం పూర్తి చేసుకుంటున్న గృహసముదాయాలను లబ్ధిదారులకు అందించేందుకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. గృహసముదాయాల మౌళిక వసతుల పనుల్లో జాప్యం, నిర్లక్ష్యం సరికాదని, ఇట్టి చర్యలకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు.

జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, రోడ్లు భవనాల శాఖ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు శ్యాంప్రసాద్, ఇ.డబ్యూఐ.డి.సి ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు వీరూపాక్షి సంబంధిత అధికారులు గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post