డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

పత్రికా ప్రకటన
సంగారెడ్డి, ఆగస్టు 11:–
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పురోగతి, జాప్యానికి కారణాలు, పూర్తయిన ఇళ్లకు దరఖాస్తులను స్వీకరించడం, ఎంక్వయిరీ , లిస్ట్ పబ్లిష్ చేయడం, అర్హులైన లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయడం తదితర అంశాలపై డివిజన్ వారీగా సంబంధిత అధికారులు, ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను అన్ని మౌలిక వసతులతో పూర్తిచేసి అర్హులైన లబ్ధిదారులకు అందించాలన్నారు. పూర్తయిన ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించి, ఎంక్వైరీ పూర్తిచేసి అర్హుల జాబితాను అందించాలన్నారు. సైట్ నకు సంబంధించిన సమస్యలను ఆయా తహశీల్దార్లు పరిష్కరించాలని ఆదేశించారు. పనులలో జాప్యం చేయరాదని స్పష్టం చేశారు. రూరల్, అర్బన్ ప్రాంతాలు అన్నింటిలోనూ వేగవంతంగా నిర్మాణాలు పూర్తి చేయాలని కోరారు.
ఈ సమావేశంలో హౌసింగ్ ఇన్చార్జ్ అధికారి తుమ్మ ప్రసాద్, ఆర్ అండ్ బి ,పంచాయతీ రాజ్ ఎస్ ఈ లు,
ఇ ఈ లు , మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఈ ఈ, ఏ ఈ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post