డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కి ముహూర్తం ఖరారు : లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల పంపిణి : అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక : లబ్ధిదారులు దళారులను నమ్మి మోస పోవద్దు , ఎవరు కూడా ఎవ్వరికి డబ్బులు ఇవ్వరాదు: అత్యంత పకడ్బందిగా వెరిఫికేషన్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది: జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.

పత్రిక ప్రకటన
తేది :23.11.2022
నిర్మల్ జిల్లా బుధవారం

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కి ముహూర్తం ఖరారు :
లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల పంపిణి :
అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక :
లబ్ధిదారులు దళారులను నమ్మి మోస పోవద్దు , ఎవరు కూడా ఎవ్వరికి డబ్బులు ఇవ్వరాదు:
అత్యంత పకడ్బందిగా వెరిఫికేషన్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది:
జిల్లా పాలనాధికారి
ముష ర్రఫ్ ఫారుఖీ.

నిర్మల్ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణిలో పూర్తిగా పారదర్శకత పాటించడం జరిగిందని,ఎవరు కూడా ఇండ్ల మంజూరిలో దళారులను ఆశ్రయించవద్దని , ఎవరైనా లబ్ధిదారులు నుండి డబ్బులు వసూలు చేస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని అన్నారు.
బుధవారం జిల్లా పాలనాధికారి మినీ సమావేశం మందిరంలో నిర్వహించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి పై అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబులతో కలసి జిల్లా పాలనాధికారి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ మాట్లాడుతూ తహసీల్దార్, సిబ్బంది తో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కేటాయింపు కై అత్యంత పారదర్శకంగా ప్రతీ ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను పరిశీలించి విచారణ జరిపిన తరువాతనే అర్హులను గుర్తించడం జరిగిందని, ఇలా మూడు దఫాలుగా గృహాలను సందర్శించి వారి వివరాలను సేకరించడం జరిగిందని, అర్హుల జాబితా ను రెండు, మూడు దఫాలుగా వెరిఫై చేసిన తరువాత నే అర్హులైన జాబితా ను తెలంగాణ స్టేట్ టెక్నికల్ సర్వీసెస్ హైదరాబాద్ కు పంపించడం జరిగిందని, వారి ద్వారా జరిపిన వెరిఫికేషన్ లో 1726 మంది అర్హత గలవారిని గుర్తించిందని తెలిపారు.
ఈ సందర్బంగా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేయాలని,ఈ నెల 25 వ తేది శుక్రవారం 9.00 గంటలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను లబ్ధిదారులకు లాటరీ ద్వారా పంపిణి చేయనున్నట్లు తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ పథకం నిరుపేదలకు సొంత ఇల్లు ఉండాలనే సదుద్దేశంతో ఈ పథకాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు.
ఈ పథకం లో భాగంగా బెంగల్ పేట్, నగనాయి పేట్ లలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను శుక్రవారం స్థానిక తిరుమల గార్డెన్, దివ్యాగార్డెన్, రాజరాజేశ్వర్ గార్డెన్ లో లబ్ధిదారులకు లాటరీ పద్దతి ద్వారా ఇళ్లు కేటాయించడం జరుగుతుందని పేర్కొన్నారు.
బంగల్ పేట్, నగునాయిపేట్ లలో మొత్తం 34 వార్డులలో 1248 ఇళ్లనుఅర్హులైన వారికి కేటాయించడం
జరుగుతుందని,
కౌట్ల 8 వార్డులలో 478 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు ఫైనల్ దశ లో ఉందని పూర్తి కాగానే అర్హులైన లబ్దిదారులకు లాటరీ ద్వారా కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
(మొత్తం 42 వార్డులు )

ఈ సమావేశం లో mro సుభాష్ చందర్, dco శ్రీనివాస్, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post