డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి

ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించుటకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా కేంద్రంలో ఉన్న వైద్య విధాన పరిషద్ ఆసుపత్రులు పటిష్ఠపరచడంతో పాటు రాబోయే కాలంలో పేద ప్రజలకు మరింత మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించుటకు మెడికల్ కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలలను ఏర్పాటు చేస్తున్నాడని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ వైద్య కళాశాలు ప్రారంభమైతే ఇకనుండి ఉస్మానియా, గాంధీ ఆసుపత్రులకు వచ్చే వ్యయ ప్రయాసలు ఉండవని అన్నారు. జిల్లా ఆసుపత్రిలో ప్రస్తుతం 5 పడకలతో నడుస్తున్న డయాలసిస్ కేంద్ర స్థాయిని 10 పడకల స్థాయికి పెంచగా శనివారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఇక్కడే 75 లక్షల ఖర్చుతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్ నిర్మాణానికి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతు కిడ్నీ బాధితులకు డయాలసిస్ కేంద్రం ఎంతో ఉపయోగపడుతుందని, కానీ ఈ డయాలసిస్ కేంద్రానికి రోగులు అధికంగా వస్తున్నందున ప్రస్తుతం ఉన్న 5 పడకల కేంద్రం సరిపోక రోగులు ఎంతో ఖర్చుతో హైదరాబాద్ కు వెళుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 10 పడకల స్థాయికి పెంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చామని అన్నారు. ఇక్కడ రోజు 40 మంది వరకు డయాలసిస్ చేయడానికి అవకాశముందని ఆమె అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా డయాలసిస్ కేంద్రంలో ఒక రోగికి మాత్రమే వాడే విధంగా సింగల్ యూజ్ ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నామని తద్వారా రోగికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్, వైరస్, ఇన్ఫెక్షన్స్ రావని అన్నారు. అదేవిధంగా వివిధ వైద్య పరీక్షలు, సిటీ స్కాన్ వంటివి నిర్వహించుటకు నిర్మిస్తున్న రేడియాలజీ ల్యాబ్ ద్వారా ప్రజలు వివిధ రకాల వైద్య పరీక్షలు ఉచితంగా చేసుకోవచ్చని అన్నారు.
అనంతరం క్యాంపు కార్యాలయంలో ముస్లిం మహిళలకు రంజాన్ కానుకగా ప్రభుత్వం అందించిన నూతన వస్త్రాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అన్ని మతాలు, పండుగలను సమ దృష్టితో చూస్తూ పేదవారు కూడా కొత్త బట్టలతో పండుగను సంతోషంగా జరుపుకోవాలని ఉద్దేశ్యంతో బతుకమ్మ,రంజాన్, క్రిస్టమస్ ల సందర్భంగా నూతన వస్త్రాలు పంపిణి చేసి వారి కళ్ళలో అంనందం చూస్తున్నదని అన్నారు. మెదక్ నియోజక వర్గానికి 2,500 గిఫ్ట్ ప్యాకెట్లు రాగా ప్రత్యేకంగా మరో 1500 గిఫ్టులు తెప్పించి మొత్తం నాలుగు వేల గిఫ్ట్ ప్యాకెట్లు పంచుతున్నామని అన్నారు. జిల్లా కేంద్రంలో 2 కోట్ల వ్యయంతో షాదీఖానా నిర్మిస్తున్నామని, పేదవారు పెళ్లిళ్లు, శుభకార్యాలు చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తూ అనేక కార్యక్రమాలు అమలుపరుస్తున్నదని, గురుకుల పాఠశాలలు నెలకొల్పి ఉచిత విద్యనందిస్తున్నదని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో వెంకటేశ్వర్లు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, డాక్టర్లు శివదయాళ్, ఆర్.డి.ఓ. సాయి రామ్, జిల్లా మైనారిటీ అధికారి జేమ్లా నాయక్, తహశీల్ధార్, మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి ,జడ్పీ వైస్ చైర్ పర్సన్ యం.లావణ్య రెడ్డి,మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, కౌన్సిలర్లు సమియొద్దీన్, కిషోర్ జయరాజ్, మెదక్ పిఎసిఎస్ చైర్మన్ హనుమంత్ రెడ్డి, రైతుబంధు మెదక్ మండల అధ్యక్షులు కిష్టయ్య, తదితరులు పాల్గొన్నారు.

Share This Post