”డాక్ సేవా అవార్డు” కింద ఉత్తమ సేవలు అందించిన కుమారి. శృతిని అభినందించిన జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన – 2. తేది:18.10.2021, వనపర్తి.

పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ”డాక్ సేవా అవార్డు” కింద ఉత్తమ సేవలు అందించిన కుమారి. శృతిని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అభినందించారు.
సోమవారం జిల్లా కలెక్టర్ తన చాంబర్లో, డాక్ సేవా అవార్డ్ కింద ” బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్” కేటగిరీ లో కుమారి శృతికి అవార్డు రావడం పట్ల జిల్లా కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు శాలువా, పూల బొకేతో జిల్లా కలెక్టర్ అభినందించారు. పోస్ట్ ఆఫీస్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం 8 కేటగిరీలలో అవార్డుల ప్రధానం జరుగుతుందని, ఇందులో భాగంగా 2020 సంవత్సరానికి గానూ ” బెస్ట్ ఉమెన్ ఎంప్లాయ్” కేటగిరీ కింద కుమారి శృతికి ఈ నెల 17న. హోటల్ ప్లాజా, హైదరాబాదులో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
కోవిడ్ లాక్ డౌన్ సమయంలో ఇంటింటికీ వెళ్లి పోస్ట్ ఆర్డర్స్ డెలివరీ చేయటం, ప్రతిరోజు వాటిని ఆన్ లైన్ లో నమోదు చేయడం, రైతు బంధు, ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకం, తదితర పథకాల కింద పోస్ట్ ఆఫీస్, లబ్ధిదారులకు చెల్లించాల్సిన డబ్బును వారి వారి ఖాతాలలో జమ అయిన మొత్తాన్ని తానే స్వయంగా వారి ఇంటికి వెళ్ళి అందించటం, కోవిడ్ సమయంలో ఒక్క రోజు సెలవు పెట్టకుండా, నిరంతరం విధులు నిర్వహించినందుకు గాను ఈ అవార్డు ఆమెకు దక్కిందని జిల్లా కలెక్టర్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, పోస్ట్ ఆఫీస్ సూపరింటెండెంట్ వి.వెంకటేశ్వర్లు, పోస్ట్ ఆఫీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…………….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post