డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రం

పత్రిక ప్రకటన
తేది: 27-8-2021
నాగర్ కర్నూల్ జిల్లా
డా. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ప్రాంతీయ శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ లో ఆర్.టి.ఐ యాక్టు-2005 పై రెండు రోజుల శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఉమ్మడి జిల్లా శిక్షణ కేంద్రం అధికారి డి. గోపాల్ అన్నారు. జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ ఆర్.టి.ఐ.యాక్టు సెక్షన్ చూస్తున్న అధికారులు, సిబ్బందికి ఈ రోజు రేపు రెండు రోజులపాటు యాక్టు పై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం ఉదయం కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో కలెక్టరేట్ పరిపాలనాధికారి మొహమ్మద్ జాకీర్ అలీ డి.టి.సి మేనేజర్ గోపాల్ గౌడ్ తో కలిసి శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ శిక్షణా తరగతులకు శశిధర్ రెడ్డి, సూపరిండెంట్, మెడికల్ డిపార్ట్, వనపర్తి జిల్లా ద్వారా తరగతులు నిర్వహించి ఆర్.టి.ఐ యాక్టు పై అవగాహన కల్పించారు.
శిక్షణ తరగతులకు జిల్లాలోని వివిధ శాఖల నుండి సిబ్బంది, డి.టి.సి. ప్రోగ్రామర్ వేంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.

Share This Post