డిండి ఎత్తిపోతల పథకం,ఏ.యం.ఆర్.పి.ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,కెనాల్ ల భూ నిర్వాసితుల కు నష్ట పరిహారం పంపిణీ త్వరగా పూర్తి చేయాలని,ఆర్&ఆర్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు

నల్గొండ,సెప్టెంబర్ 21.డిండి ఎత్తిపోతల పథకం,ఏ.యం.ఆర్.పి.ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,కెనాల్ ల  భూ నిర్వాసితుల కు నష్ట పరిహారం  పంపిణీ త్వరగా పూర్తి చేయాలని,ఆర్&ఆర్ పనులు వేగవంతం చేయాలని  జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో     డిండి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న  శివన్న గూడెం,క్రిష్ణ రాయిని పల్లి,గొట్టి ముక్కల ప్రాజెక్ట్ ,చింత పల్లి,సింగ రాజు పల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,డిండి మెయిన్ కెనాల్,కెనాల్  ల కారణంగా భూములు కోల్పోతున్న భూ నిర్వాసితులకు నష్ట పరిహారం, ఆర్&ఆర్ పనులు సమీక్షించి, నష్ట పరిహారం భూ నిర్వాసితులకు త్వరగా పూర్తి చేసి,ఆర్&ఆర్ పనులు వేగంగా పూర్తి చేయాలని,కాలనీ లు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.ఏ.యం.ఆర్.పి.కింద ఉదయ సముద్రం, పెండ్లి పాకల,, ధర్మారెడ్డి, పిల్లాయి పల్లి కాల్వ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.ఆర్&ఆర్ కాలనీ ల ఏర్పాటు వేగవంతం చేయాలని,   గొట్టి ముక్కల ఆర్&ఆర్ కాలనీ పనులు ఏర్పాటు వేగవంతం చేయాలని, క్రిష్ణ రాయిని పల్లి ఆర్&ఆర్ కాలనీ ఏర్పాటుకు భూమి గుర్తించి నివేదిక సమర్పించాలని,శివన్న గూడెం భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని అన్నారు.  ఈ సమావేశంలో అదనపు కలెక్టర్  వి.చంద్ర శేఖర్,అసిస్టెంట్ కలెక్టర్ ట్రైనీ అపూర్వ్ చౌహన్, ఇరి గేషన్ ఎస్.ఈ. ఆనంద్,డి.ఆర్.ఓ.జగదీశ్వర్ రెడ్డి,దేవరకొండ ఆర్.డి.ఓ.గోపిరాం,మిర్యాలగూడ ఆర్.డి.ఓ.రోహిత్ సింగ్, భూ సేకరణ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జగన్నాథ రావు తదితరులు పాల్గొన్నారు.

డిండి ఎత్తిపోతల పథకం,ఏ.యం.ఆర్.పి.ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ లు,కెనాల్ ల భూ నిర్వాసితుల కు నష్ట పరిహారం పంపిణీ త్వరగా పూర్తి చేయాలని,ఆర్&ఆర్ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆదేశించారు.

Share This Post