డిగ్రీ కళాశాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు సాధనకు ఉపయోగ పడే పుస్తకాలు విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు సూచించారు.

శుక్రవారం కలెక్టర్ చాంబర్ లో ఎస్సీ, ఎస్టీ, బిసి సంక్షేమ అధికారులతో పాటు, ఉపాధి కల్పన, పరిశ్రమలు, ఎల్డీయం, ఆర్టీసి, కొతగూడెం, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లుతో లైబ్రరరీలు ఏర్పాటు, పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయడం, పోటీ పరీక్షల మెటీరియల్ ఏర్పాటు,  మౌలిక సదుపాయాలు కల్పన, విద్యార్థులకు  స్పోకెన్ ఇంగ్లీషు తరగతులు నిర్వహణ,  క్రీడలు నిర్వహణ తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి  పేరెంట్స్ కమిటి సమావేశాలు నిర్వహించాలని చెప్పారు. మీ మీ పరధిలో ఉన్న ప్రైవేట్ డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ బాధ్యత ప్రిన్సిపాల్స్ దేనని, ఉదాసీనంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో పరీక్షలు నిర్వహణలో పర్యవేక్షణ కొరవడిందని, పరీక్షలు నిర్వహణ విషయాన్ని కూడా తనకు తెలియచేయడం లేదని పాఠాలు చెప్పి వెళ్తామంటే కుదరదని ఆయన హెచ్చరించారు. కోవిడ్ వల్ల  ప్రత్యక్ష విద్యాబోధన జరగలేదని అదనపు తరగతులు నిర్వహించి విద్యార్ధులను  సన్నద్ధం చేయాలని చెప్పారు. 18వ తేదీ నాటికి తరగతులు నిర్వహణపై షెడ్యూలు అందచేయాలని పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆటల్లోను ఆణిముత్యాలను తయారు చేయాల్సిన బాధ్యత మీపైనే ఉందని చెప్పారు. కళాశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ పెంచాలని చెప్పారు. నూరుశాతం ఫలితాలు సాధించాలని, సబ్జెక్టుల్లో వెనుకంజలో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక తరగుతులు నిర్వహించాలని చెప్పారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఉపాధి కల్పనాధికారికి సూచించారు. జాబ్ మేళాకు విద్యార్ధులను పెద్ద ఎత్తున తీసుకురావాల్సిన బాధ్యత సంబంధిత కళాశాలల సిబ్బంది పైనే ఉందని ఆయన స్పష్టం చేశారు. డిగ్రీ చదివిన విద్యార్ధులు వ్యవసాయం, కూలి పనులకు వెళ్లకుండా వారిని పారిశ్రామిక వేత్తలుగా తయారు చేయుటకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు. డిగ్రీ విద్య పూర్తిచేసిన విద్యార్థులు ఉద్యోగ, ఉపాధి మార్గాలను ఎంచుకోవడానికి అవగాహన కార్యక్రమాలు చాలా ఉపయోగకరమైనవి చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధనతో పాటు బ్యాంకు తదితర పోటీ పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు ఉపయోగపడే మెటీరియల్  జాబితాను అందచేయాలని చెప్పారు. 2016 సంవత్సరం నుండి డిగ్రీ కళాశాలలకు మంజూరయిన వివిధ  నిధులు, చేపట్టిన పనులు, పురోగతి తదితర అంశాలపై నివేదికలు అందచేయాలని చెప్పారు. డిగ్రీ కళాశాలల పర్యవేక్షణ బాధ్యతలు శ్రీ రామచంద్రా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ జె మాధవి కన్వీనర్ గా వ్యవహరిస్తారని చెప్పారు. ఎటువంటి పోటీ పరీక్షల్లోనైనా ఇంగ్లీషు చాలా ముఖ్యమని విద్యార్థులు ఇంగ్లీషులో ప్రావీణ్యం సాధించు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షా సమావేశపు మినిట్స్ ప్రతిని  సోమవారం వరకు తనకు అందచేయాలని చెప్పారు. రానున్న 15 రోజుల్లో తిరిగి సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కళాశాలలు భూములు పరిరక్షణ బాధ్యత సంబంధిత ప్రిన్సిపాళ్లపైనే ఉందని, ఆక్రమణల వివరాలు నివేదిక  అందచేయాలని, పరిరక్షణ చర్యలు చేపట్టాలని చెప్పారు. కళాశాలల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు పరిశుభ్రంగా ఆహ్లాదకరంగా ఉండాలని చెప్పారు. తన పర్యటనల్లో కళాశాలలను తనిఖీ చేస్తానని చెప్పారు. కళాశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు. ప్రతి కళాశాలలో సురక్షిత మంచినీటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. విద్యార్థులు బస్టాండ్ నుండి కళాశాలల వరకు వెళ్లడానికి ఇబ్బంది లేకుండా బస్సు సౌకర్యం కల్పించుటకు చర్యలు తీసుకోవాలని ఆర్టీసి డీవియంకు సూచించారు. ఉపకార వేతనాలకు పెండింగ్లో ఉన్న అన్ని దరఖాస్తులను ఈ నెలాఖరు వరకు పరిష్కరించి నివేదికలు అందచేయాలని ప్రిన్సిపాళ్లును ఆదేశించారు.

ఈ సమావేశంలో ఎస్సీ అభివృద్ధి అధికారి అనసూర్య, ఉపాధికల్పన అధికారి విజేత, ఎల్డీయం శ్రీనివాస్, ఆర్టిసి డివియం శ్రీక్రిష్ణ, డిగ్రీ కళాశాలల కన్వీనర్ డాక్టర్ మాధవి, ఇల్లందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం కళాశాలల ప్రిన్సిపాళ్లు డాక్టర్ పద్మావతి, డాక్టర్ చిన్నప్పయ్య, డాక్టర్ శ్రీనివాస్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

Share This Post