డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పెంచే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ జీ రవి

ప్రచురణార్థం—-1

తేదీ.8.6.2022

ప్రచురణార్థం----1  తేదీ.8.6.2022  డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పెంచే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ జీ రవి  ఆన్ లైన్ ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి  ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునేలా అవగాహన కల్పన  సుమంగళి గార్డెన్స్ నందు నిర్వహించిన ఖాతాదారుల ఔట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్  జగిత్యాల జూన్ 8:-   ప్రజలలో డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం ధర్మపురి రోడ్డు లోని సుమంగళి గార్డెన్స్ లో ఆజాది అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా  నిర్వహించిన బ్యాంకు ఖాతాదారుల ఔట్ రిచ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.  ప్రభుత్వం నిర్దేశించిన పలు ప్రమాణాలలో జగిత్యాల బ్యాంకర్లు ఉత్తమ ప్రతిభ కనబరచారని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో తమ సహకారం అందించాలని కలెక్టర్ ప్రశంసించారు.  బ్యాంకులు అందించే రుణాలు సకాలంలో తిరిగి చెల్లించిన పక్షంలో మరింత రుణాలు పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాలు ఎప్పటికప్పుడు సకాలంలో 99% పైగా చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ అన్నారు.   బ్యాంకుల ఖాతాదారుల ఔట్ రిచ్ కార్యక్రమంలో బ్యాంకులు అందించే వివిధ రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.   గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీల అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. ఆసరా పింఛన్, రైతుబంధు, ధాన్యం కొనుగోలు సంబంధిత ప్రభుత్వం కార్యక్రమాల నిధులు ప్రజలకు బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు, రైతులు నగదు విత్ డ్రా అధికంగా చేస్తున్నారని, వీరికి ఆన్లైన్ లావాదేవీలు పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.   ప్రజలకు ఆన్ లైన్  లో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల సైతం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మన సెల్ ఫోన్లలో అధిక మొత్తంలో నగదు, కార్  గెలుచుకున్నట్లు వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.  జిల్లాలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద కాకుండా  బ్యాంకు లలో ప్రజలు రుణ సదుపాయం పొందే విధంగా గా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకులు అందిస్తున్న వివిధ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని, రుణాలను సకాలంలో చెల్లించాలని కలెక్టర్ కోరారు  లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రెడ్డి, జిల్లాలోని బ్యాంకుల మేనేజర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు  జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.
డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పెంచే దిశగా చర్యలు:: జిల్లా కలెక్టర్ జీ రవి

ఆన్ లైన్ ఆర్థిక మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

ప్రతి ఒక్కరూ బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునేలా అవగాహన కల్పన

సుమంగళి గార్డెన్స్ నందు నిర్వహించిన ఖాతాదారుల ఔట్ రీచ్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్

జగిత్యాల జూన్ 8:- ప్రజలలో డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత పెంపొందించే దిశగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. బుధవారం ధర్మపురి రోడ్డు లోని సుమంగళి గార్డెన్స్ లో ఆజాది అమృత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బ్యాంకు ఖాతాదారుల ఔట్ రిచ్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.

ప్రభుత్వం నిర్దేశించిన పలు ప్రమాణాలలో జగిత్యాల బ్యాంకర్లు ఉత్తమ ప్రతిభ కనబరచారని, ప్రభుత్వ లక్ష్యాల సాధనలో తమ సహకారం అందించాలని కలెక్టర్ ప్రశంసించారు.

బ్యాంకులు అందించే రుణాలు సకాలంలో తిరిగి చెల్లించిన పక్షంలో మరింత రుణాలు పొందే అవకాశం ఉంటుందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో మహిళా సంఘాలు ఎప్పటికప్పుడు సకాలంలో 99% పైగా చెల్లింపులు జరుగుతాయని కలెక్టర్ అన్నారు.

బ్యాంకుల ఖాతాదారుల ఔట్ రిచ్ కార్యక్రమంలో బ్యాంకులు అందించే వివిధ రుణాలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.

గ్రామీణ ప్రాంతంలో డిజిటల్ ఆర్థిక లావాదేవీల అవగాహన కార్యక్రమాలు మరింత విస్తృతంగా చేపట్టాలని బ్యాంకర్లకు కలెక్టర్ సూచించారు. ఆసరా పింఛన్, రైతుబంధు, ధాన్యం కొనుగోలు సంబంధిత ప్రభుత్వం కార్యక్రమాల నిధులు ప్రజలకు బ్యాంకు ఖాతాల ద్వారా అందించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులు, రైతులు నగదు విత్ డ్రా అధికంగా చేస్తున్నారని, వీరికి ఆన్లైన్ లావాదేవీలు పట్ల అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు.

ప్రజలకు ఆన్ లైన్ లో జరుగుతున్న ఆర్థిక మోసాల పట్ల సైతం అవగాహన కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. మన సెల్ ఫోన్లలో అధిక మొత్తంలో నగదు, కార్ గెలుచుకున్నట్లు వచ్చే మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ తెలిపారు.

జిల్లాలో ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల వద్ద కాకుండా బ్యాంకు లలో ప్రజలు రుణ సదుపాయం పొందే విధంగా గా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. బ్యాంకులు అందిస్తున్న వివిధ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా ఎదగాలని, రుణాలను సకాలంలో చెల్లించాలని కలెక్టర్ కోరారు

లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రెడ్డి, జిల్లాలోని బ్యాంకుల మేనేజర్లు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

జిల్లా పౌరసంబంధాల అధికారి జగిత్యాల జారీ చేయనైనది.

Share This Post