డిజిటల్ చెల్లింపులలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్

డిజిటల్ చెల్లింపులలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్

డిజిటల్ చెల్లింపులలో జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి : జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్

—————————–
సిరిసిల్ల 29, ఏప్రిల్ 2022:
——————————
డిజిటల్ చెల్లింపుల్లో రాజన్న జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ బ్యాంకర్ లకు సూచించారు.

శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం సమావేశ మందిరంలో జిల్లాలో వందశాతం డిజిటలైజేషన్ పై ఎంపీడీవోలు, బ్యాంకర్లతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ బి సత్య ప్రసాద్ మాట్లాడుతూ…..

మార్చి 2022 నాటికి రాజన్న సిరిసిల్ల జిల్లాలో 75.56 శాతం డిజిటలీకరణ జరిగిందని పేర్కొన్నారు. మే నెలాఖరులోగా వంద శాతం డిజిటలీ కరణ పూర్తి చేసేలా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు.

PM స్వానిధి కింద జిల్లాలో వీధి విక్రయదారులకు మొదటి అంచే లో 5579 మందికి రూ 10 వేల చొప్పున రుణాలను ఇవ్వడం జరిగిందని అదనపు కలెక్టర్ తెలిపారు .

రెండో అంచె లో 3,492 మందికి 20 వేల చొప్పున రుణాల మంజూరు ను లక్ష్యంగా ప్రభుత్వం జిల్లాకు నిర్దేశించిందని అన్నారు.

ఈ లక్ష్య సాధనకు బ్యాంకర్లు సహకరించాలని అదనపు కలెక్టర్ కోరారు.

అలాగే కిసాన్ క్రెడిట్ కార్డు ( కిసాన్ భాగిధారి ప్రధమిక హామారి – FBPH) కింద అర్హులైన వారు రుణాల కోసం దరఖాస్తు చేసుకుంటే వెంటనే వారికి మంజూరు చేయాల్సిందిగా అదనపు కలెక్టర్ బ్యాంకర్ లకు సూచించారు .
అలాగే ఎస్సీ కార్పొరేషన్ కింద యూనిట్లను త్వరితగతిన గ్రౌండింగ్ చేయాలని బ్యాంకర్ లను ఆదేశించారు.

సమావేశంలో నాబార్డ్ డీడీఎం మనోహర్ రెడ్డి, RBI AGM రాజేంద్ర ప్రసాద్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ రంగారెడ్డి, జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గౌతంరెడ్డి, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి మదన్ మోహన్, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు వినోద్, ఎంపీడీవోలు ,బ్యాంకు మేనేజర్లు పాల్గొన్నారు.

——————————
డీ.పీ.ఆర్.ఓ, రాజన్న సిరిసిల్ల కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post