డిమాండ్ కు అనుగుణంగా నర్సరీలో మొక్కలను పెంచాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

డిమాండ్ కు అనుగుణంగా నర్సరీలో మొక్కలను పెంచాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

*ప్రచురణార్థం-1*

రాజన్న సిరిసిల్ల, జనవరి 04: స్థానిక ప్రజలు ఇండ్లలో పెంచుకునే విధంగా, వారి డిమాండ్ కు అనుగుణంగా గ్రామ పంచాయితీ నర్సరీల్లో మొక్కలను పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. మంగళవారం ఎల్లారెడ్డిపేట మండలం హరిదాస్ నగర్ గ్రామంలోని నర్సరీని కలెక్టర్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీలో ఎన్ని మొక్కలు పెంచుతున్నారు, విత్తనాల రకాల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. 39 వేల బ్యాగ్ లలో మట్టిని నింపి వివిధ రకాల మొక్కలను పెంచడం జరుగుతుందని కలెక్టర్ కు సిబ్బంది వివరించారు. ఇండ్లకు పంపిణీ చేయడంతో పాటు, రోడ్లకు ఇరువైపులా నాటే మొక్కలు, అడవి జాతి మొక్కలను పెంచాలని కలెక్టర్ సూచించారు. మండలంలో మంజూరు అయిన రైతుల పంట కల్లాలు సంబంధిత రైతులు త్వరితగతిన నిర్మించేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ పరిశీలనలో జెడ్పీటీసీ లక్ష్మణ్ రావు, ఎంపీపీ రేణుక, ఎంపీడీఓ చిరంజీవి, స్థానిక ప్రజాప్రతినిధులు, తదితరులు ఉన్నారు.

Share This Post