డియంఎఫ్, ఎస్ఈఏ, సిఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఇంజనీరింగ్, ఏజన్సీలను ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్ సమావేశపు హాలులో డియంఎఫ్, ఎస్ఈఏ, సిఎస్ఆర్ నిధులు కేటాయింపు, నిర్మాణ పనుల ప్రగతిపై జిల్లా అధికారులు, పరిశ్రమల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలున్న మన జిల్లాలో మౌలిక సదుపాయాలు కల్పనకు ప్రత్యేకంగా కేటాయించిన నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను జాప్యం చేయొద్దని చెప్పారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను గమనించి అధికారులు అంకితభావంతో పనులు పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. నిధులు కేటాయింపు జరిగినా ఇంకా ప్రారంభించని పనుల నిధులును కారణాలు తెలియచేస్తూ కలెక్టరేట్కు సరెండర్ చేయాలని చెప్పారు. ఇట్టి నిధులను ప్రాధాన్యతను బట్టి కేటాయింపులు చేస్తామని ఏజన్సీలు ఇట్టి పనులకు అనుమతి ఇవ్వాలని చెప్పారు. చేపట్టిన పనులను అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందితో నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. పర్యవేక్షణ కొరవడితే పనుల్లో జాప్యం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. హైరిస్క్ ఉన్న గర్భిణి మహిళల ఆరోగ్య పరిరక్షణకు నిరంతర పర్యవేక్షణకు కొరకు ప్రత్యేకంగా యాప్ తయారు చేయాలని యాస్పిరేషన్ సిబ్బందిని ఆదేశించారు. రక్తహీనతతో భాదపడుతున్న చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ఇల్లందు ఆసుపత్రి నందు న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యాధికారికి సూచించారు. వినియోగించిన నిధులకు సంబంధించి యుటిలైజేషన్ ధృవీకరణ పత్రాలు అందచేయాలని, యుసిలు సమర్పించకపోవడం వల్ల తిరిగి నిధులు కేటాయింపు చేయుటకు అవకాశం ఉండదని అధికారులు ఇట్టి విషయాన్ని ఎంతో ప్రాధాన్యమైనదిగా గుర్తించాలని చెప్పారు. ప్రగతిలో ఉన్న పనులను పూర్తి చేయుటకు అధికారులు షెడ్యూలు ఇవ్వాలని, ఇచ్చిన షెడ్యూలు గడువులోగా పనులను పూర్తి చేయాలని చెప్పారు. దివ్యాంగులకు మోటారు వాహనాలు, అంధులకు సెన్సార్ చేతి కర్రలు పంపిణీకి ప్రతిపాదనలు అందచేయాలని సంక్షేమ అధికారికి సూచించారు.

 

ఈ సమావేశంలో డిఆర్డీ అశోక్ చక్రవర్తి, డిఆర్డిఓ మధుసూదన్ రాజు, పిఆర్ ఈఈలు సుధాకర్, మంగ్యా, ర.భ. ఈ ఈ భీంమ్లా, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, సంక్షేమ అధికారి వరలక్ష్మి, ఐటిడిఏ ఏపిఓ జనరల్ డేవిడ్రాజు, గిరిజన సంక్షేమ శాఖ ఈఈ తానాజి, సింగరేణి, ఐటిసి, కేటిపిఎస్, నవభారత్ తదితర కంపెనీల అధికారులు పాల్గొన్నారు.

Share This Post