డిసిసి, డిఎల్ఆర్.సి. 2022-23 సం. త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం : జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్

పత్రికా ప్రకటన
తేది:29.11.2022, వనపర్తి.

ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా బ్యాంక్ అధికారులు లబ్ధిదారులకు రుణాలను సకాలంలో అందించాలని జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్. లోకనాథ్ రెడ్డి బ్యాంకర్లను ఆదేశించారు.
మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో డిసిసి, డిఎల్ఆర్.సి. 2022-23 సం. త్రైమాసిక  బ్యాంకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రభుత్వం స్వయం ఉపాధి కింద ఎంపిక చేసిన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందజేయాలని ఆయన అన్నారు. జిల్లాలోని ఎస్. హెచ్.జి. సంఘాల సభ్యులకు స్వయం ఉపాధి క్రింద మంజూరైన రుణాలను వెంటనే అందించాలని ఆయన తెలిపారు. సి ఎస్ టి లబ్ధిదారుల స్వయం ఉపాధికి బ్యాంకర్లు  ప్రత్యేక దృష్టి సారించి రుణాలు అందజేయాలని ఆయన అన్నారు.
వ్యవసాయ ప్రాధాన్యతా రంగం, ఆర్థిక మద్దతు పథకాల అమలులో ప్రభుత్వం కీలక పాత్ర పోషిస్తోందని ఆయన అన్నారు. సమాజంలో సమాన అవకాశాలు కల్పించేందుకు, రుణాల కోసం నిరుద్యోగులు, రైతులు ప్రాధాన్యతను సంతరించుకున్నారని ఆయన తెలిపారు. విద్యా రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన రుణాలను బ్యాంకులు, లైన్ డిపార్ట్‌మెంట్లు పెండింగ్ లో లేకుండా చూడాలని ఆయన సూచించారు. అర్హత గల ఎస్.సి, ఎస్.టి. కార్పొరేషన్ సబ్సిడీ రుణాలను లబ్ది దారులకు వెంటనే మంజూరు చేయాలని ఆయన తెలిపారు. నైపుణ్యం వున్న, అర్హత గల అభ్యర్థులను గుర్తించి, రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లకు  ఆయన కోరారు.
జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల ద్వారా అందించే రుణాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని, ప్రజలకు అవగాహన కల్పించి ప్రభుత్వ రుణాలను సకాలంలో అందజేయాలని ఆయన తెలిపారు. వివిధ పథకాల ద్వారా లబ్ధిదారులకు 100 శాతం రుణాలు అందించాలని బ్యాంకర్లకు ఆయన సూచించారు. ఎస్.హెచ్.జి. గ్రూపు సభ్యులకు సకాలంలో బ్యాంకు రుణాలను మంజూరు చేయాలని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) ఆశిష్ సంగ్బాన్, లీడు బ్యాంకు మేనేజర్ అమూల్ పవార్, నాబార్డ్ ఏ.జి.ఎం, డి.ఆర్.డి.ఓ. నరసింహులు, బ్యాంక్ మేనేజర్లు, జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారి చేయబడినది.

Share This Post