డిసెంబర్ చివరినాటికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 10-12-2021

డిసెంబర్ చివరినాటికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

డిసెంబర్ చివరినాటికి కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 10:
జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డిసెంబర్ చివరి కల్లా పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను అదేశించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రగతిపై అధికారులతో జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ కొరకు కృషి వలన మొదటి డోస్ వ్యాక్సిన్ లక్ష్యం చివరికి చేరుకున్నందున సంబంధిత అధికారులను, సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. అదే ఉత్సాహంతో రెండవ డోస్ కూడా పూర్తిచేయాలని పేర్కోన్నారు. జిల్లాకు ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారికి, 18 సంవత్సరాలు నిండిన వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ అందించాలని, ఉదయం సాయంత్రం వ్యాక్సినేషన్ విధులు నిర్వహించి చివరిదశ మొదటి డోస్ పూర్తిచేయాలని, గ్రామాలలో 1000, మున్సిపాలిటిలో 3000 వ్యాక్సిన్ లక్ష్యాన్ని సాధించెలా ముందస్తు ప్రణాళికను రూపొందించుకొని వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని తెలిపారు. ప్రతిరోజు వ్యాక్సిన్ పూర్తిచేసేలా మెడికల్ సిబ్బంది కృషిచేయాలని, ప్రజల్లో వ్యాక్సిన్ పై అవగాహన కల్పిచి, వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తిచేయాలని సూచించారు. పనిచేసే సిబ్బందికి భోజనం ఏర్పాట్లు సకాలంలో అందేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. డిసెంబర్ చివరికల్ల కోవిడ్ లక్ష్యం పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, ఇతర వైద్యాధికారులు, పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post