డిసెంబర్ నెలాఖరుకు కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులను 100 శాతం సాధించుటకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పిలుపునిచ్చారు.

డిసెంబర్ నెలాఖరుకు కొవిడ్ వ్యాక్సినేషన్ రెండు డోసులను 100 శాతం సాధించుటకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పిలుపునిచ్చారు.

కరోనా కట్టడి,వ్యాక్సినేషన్ పై ముఖ్యమంత్రి గారు నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ నిరంతరం రాష్ట్రంలో ని పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని క్యాబినెట్ సబ్ కమిటీ సభ్యులు కూడా అయిన మంత్రి సబితా రెడ్డి తెలిపారు. పంచాయతీ ,మున్సిపల్ ,విద్య, ఆరోగ్యం సహా అన్ని శాఖలు సమన్వయం చేసుకుంటు లక్ష్యాన్ని సాధించాలన్నారు. గ్రామాల్లో సర్పంచ్ లు,ఎంపీటీసీలు,ఆశ వర్కర్లు,ఏ ఎన్ ఎం లు,అంగన్ వాడి కార్యకర్తలు, సమన్వయంతో పని చేయాలన్నారు.
తక్కువ వాక్సినేషన్ నమోదు అయిన
పి హెచ్ సి లపై జిల్లా స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి,ఆయా సెంటర్ లను సందర్శించాలన్నారు.వాక్సినేషన్ పై ప్రజలలో ఉన్న అపోహలను తొలగించాలని తెలిపారు.ఒమైక్రాన్ ను అరికట్టుటకు వ్యాక్సిన్ తో పాటు, ప్రజలు తప్పని సరిగా మాస్క్ దరించడం,కొవిడ్ నిబందనలను పాటించడమే ఏకైక మార్గం అని తెలిపారు.వాక్సినేషన్ ప్రక్రియలో దేశంలోని అనేక ఇతర రాష్ట్రాల కన్నా తెలంగాణ ముందువరుసలో ఉందని,మరింత బాగా పని చేసి పూర్తి లక్ష్యాన్ని సాధించాలన్నారు.ప్రభుత్వ శాఖల సమన్వయంతో డిసెంబర్ నాటికి 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాలను సాధించుటకు ఆవాసాలు,వార్డులు,సబ్ సెంటర్లు,మున్సిపాలిటీలు , మండలాలు వారీగా యాక్షన్ ప్లాన్  రూపొందించుకొని ముందుకు సాగాలన్నారు.

పాఠశాలలు, కళాశాలలు , వసతి గృహలలో కోవిడ్ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. అవసరమైన చోట విద్య సంస్థలలో వ్యాక్సినేషన్ శిబిరాలు ఏర్పాటు చేసి 100 శాతం లక్ష్యాలను సాధించాలని అధికారులకు సూచించారు. పాఠశాలలలో పనిచేస్తున్న టీచింగ్ , నాన్ టీచింగ్ స్టాప్ లో 90 శాతం వ్యాక్సినేషన్ జరిగినట్లు మంత్రి తెలిపారు.

జిల్లా కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ, సెప్టెంబర్ మాసము నుండి ఇప్పటి వరకు జిల్లాలో స్పెషల్ డ్రైవ్ నిర్వాహంచి 5 లక్షల 82 వేల మందికి వాక్సినేషన్ చేయడం జరిగిందన్నారు.మొదటి డోజ్ వేసుకున్న 27 వేల మంది రెండవ డోజ్ కు అర్హులు ఉన్నారని, వీరందరికి రెండవ డోజ్ వేసేందుకు ఇంటింటికి వెళ్లి వాక్సినేషన్ పూర్తి చేస్తామని తెలిపారు.జిల్లాలో వైద్య శాఖ,మున్సిపల్,పంచాయతీ రాజ్ శాఖలు పూర్తి బాధ్యతతో పని చేస్తున్నాయని, అదే స్ఫూర్తితో 100 శాంతం లక్ష్యం సాధిస్తామన్నారు.

ఈ సమావేశంలో జడ్పీ చైర్ పర్సన్ సునీతా రెడ్డి ,ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్,కాలే యాదయ్య, కొప్పుల మహేష్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి,రాష్ట్ర విద్యా మౌళిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్,జడ్పీ వైస్ ఛైర్మన్ విజయకుమార్ ,డిసీసీబీ,డిసిఎంఎస్,జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు మనోహర్ రెడ్డి , కృష్ణారెడ్డి ,మురళి కృష్ణ ,అడిషనల్ కలెక్టర్లు మోతిలాల్, చంద్రయ్య ,జిల్లా వైద్యాధికారి తుకారం,విద్యాధికారి రేణుక దేవి, ఆయా మండలాల ఎంపీపీ,జడ్పీటీసీ లు,మునిసిపల్ చైర్మన్లు, ఎంపీడీఓలు,తహశీల్దార్లు పాల్గొన్నారు.
_*——————————
జిల్లా పౌర సంబంధాల అధికారి వికారాబాద్ జిల్లా గారిచే జారీచేయనైనది

Share This Post