డిసెంబర్ నెలాఖరు లోగా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేస్తాం

ప్రచురణార్ధం

డిసెంబర్ నెలాఖరు లోగా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేస్తాం.

మహబూబాబాద్, డిసెంబర్,01.

డిసెంబర్ నెలాఖర్ లోగా వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

బుధవారం కలెక్టర్ కార్యాలయ ప్రజ్ఞ వీడియో కాన్ఫరెన్స్ హాలులో హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు వైద్యశాఖ మంత్రి హరీష్ రావు, మున్సిపల్ వ్యవహారాలు మంత్రి తారక రామారావు, విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ లు కలిసి వ్యాక్సినేషన్, ఆర్.టి.సి.పి.ఆర్.,రేడియాలజీ ల్యాబ్ లు, సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థలాలు, హాస్పిటల్, వైద్య కళాశాలలకు స్థలాలు కేటాయింపు పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నివేదిస్తూ… డిసెంబర్ నెలాఖర్లోగా వ్యాక్సినేషన్ పూర్తి చేయిస్తామని తెలిపారు.

అనంతరం వైద్య శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ వసతి గృహాల్లో 3రోజులు క్యాంప్ ఏర్పాటు చేసి వ్యాక్సిన్ వేసుకొనివారు ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాతనే క్యాంప్ తీయాలన్నారు.
ప్రభుత్వ సంకల్పం నెరవేరేందుకు స్పెషల్ డ్రైవ్ ను పూర్తి స్థాయిలో చేపట్టా లన్నారు. జిల్లా పరిషత్, మున్సిపల్ చైర్మన్లు భాగస్వామ్యం అందించాలని వ్యాక్సినేషన్ అయిన చోట ప్రకటిస్తూ పోటీతత్వం నెలకొల్పాలి అన్నారు.

రాష్ట్ర మున్సిపల్ వ్యవహారాల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామరావు మాట్లాడుతూ వ్యాక్సినేషన్ పై గ్రామాలలో విస్తృత ప్రచారం చేయాలన్నారు పత్రికల ద్వారా కేబుల్ నెట్వర్క్ ద్వారా ప్రజలకు తెలియజేయాలన్నారు అదేవిధంగా గా హాస్పిటల్స్ లలో ఖాళీగా ఉన్న బెడ్స్ వివరాలను పత్రికలకు అందజేయాలన్నారు అసత్య ప్రచారాలు పై తక్షణం స్పందిస్తూ పుకార్లు వదంతులు నమ్మరాదని సూచిస్తూ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యత తెలియజేయాలన్నారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ పాఠశాలల్లో కళాశాలల్లో గురుకులాలు రెసిడెన్షియల్ స్కూల్స్ లలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని 100% పూర్తయినట్టు గా ప్రకటించాలన్నారు ఆర్ టి పి సి ఆర్ తోపాటు రేడియాలజీ ల్యాబ్స్ నిర్మాణం కొరకు స్థలాలు కేటాయించాలని అన్నారు అదే విధంగా మెడికల్ కళాశాల కొరకు హాస్పిటల్స్ లో చేపడుతున్న అదనపు బెడ్స్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలన్నారు ప్రజల్లో చైతన్యం తెచ్చే కార్యక్రమాలు చేపట్టాలని గ్రామాలలో తమక వేయించాలని రికార్డింగ్ లతో ఆటోలు ఏర్పాటు చేసి గ్రామ కూడళ్లలో అన్నారు అదేవిధంగా శానిటేషన్ భాగంగా చెత్త సేకరణ లో ఇంటింటికి తిరుగుతూ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతను రికార్డింగ్ ద్వారా మైకుల లో ప్రచారం చేస్తూ తెలియజేయాలన్నారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్, జడ్పి సి.ఈ.ఓ.రమాదేవి, డి.ఆర్.డి.ఏ.పీడీ సన్యాసయ్య, జిల్లా వైద్యాధికారి హరీష్ రాజు, మహబూబాబాద్, మరిపెడ మున్సిపల్ చైర్మన్లు పాల్వాయి రాంమోహన్ రెడ్డి, సింధూర, వైద్యాధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది.

Share This Post