డిసెంబర్ నెలాఖరు వరకు మండలానికి రెండు చొప్పున పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి…రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి.

డిసెంబర్ నెలాఖరు వరకు మండలానికి రెండు చొప్పున పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి…రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి.

ప్రచరణార్థం

డిసెంబర్ నెలాఖరు వరకు మండలానికి రెండు చొప్పున పాఠశాలల్లో పనులు పూర్తి చేయాలి…రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి.

* వచ్చే వారం నుంచి అందుబాటులోకి ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్

ఇక పై సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా నిధుల విడుదల

డిసెంబర్ చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలలో గ్రంథాలయాల ఏర్పాటు

పాఠశాల నిర్వహణకు 130 కోట్లు విడుదల

మన ఊరు మన బడి పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి
——————————–
పెద్దపల్లి, డిసెంబర్ -08:
——————————–
మండలానికి రెండు పాఠశాలల చొప్పున మన ఊరు మన బడి పాఠశాల పనులు డిసెంబర్ నెలాఖరు వరకు పూర్తి చేసి ప్రారంభానికి సన్నద్దం చేయాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

గురువారం హైదరాబాద్ నుండి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి , టి.ఎస్.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్య సంచాలకులు శ్రీదేవసేన లతో కలిసి మన ఊరు మన బడిపై జిల్లా కలెక్టర్ లు, సంభందిత అధికారులతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి ఈ వీడియో సమావేశంలో పాల్గొన్నారు.

విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ మన ఊరు మన బడి కార్యక్రమాన్ని రూపోందించారని, మొదటి దశలో చేపట్టిన 9123 పాఠశాలలో 30 లక్షల కంటే అధిక వ్యయం ఉన్న పాఠశాలలో కేవలం కొన్ని మాత్రమే గ్రౌండ్ అయ్యాయని, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ నామినేషన్ పద్ధతిలో సదరు పాఠశాల పనులు చేపట్టాలని మంత్రి సూచించారు.

ప్రతి మండలంలో 2 మోడల్ పాఠశాలలను ఎంపిక చేసుకున్నామని, డిసెంబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 1200 పాఠశాలలను ప్రారంభించేందుకు సన్నద్దం చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు మోడల్ పాఠశాలలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని , 10% గ్రీన్ బడ్జెట్ వినియోగిస్తూ పచ్చదనం పెంపోందెలా చర్యలు తీసుకోవాలని మంత్రిసూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 1200 మోడల్ పాఠశాలలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని, క్షేత్రస్థాయిలో రెడ్కో అధికారులకు అవసరమైన సహకారం అందించి పూర్తి చేయాలని అన్నారు. మన ఊరు మనబడి సంబంధించి ఎన్.ఆర్. ఈ.జి.ఎస్. కింద చేపట్టిన పనుల వివరాలు అందిస్తే వెంటనే నిధులు విడుదల వుతాయని మంత్రి తెలిపారు.

మన ఊరు మన బడి కార్యక్రమానికి నిధులకు ఎలాంటి కోరత లేదని, పనుల ఎఫ్‌టి.ఓ లు జనరెట్ చేసిన వెంటనే నిధుల విడుదల జరుగుతుందని అన్నారు. గడిచిన వారం రోజుల్లో 100 కోట్ల నిధులు మన ఊరు మనబడి కింద విడుదల చేసామని తెలిపారు.

సెంట్రల్ పూలింగ్ విధానం ద్వారా ఇక పై చెల్లింపులు జరుగుతాయని, మొదట పనులు పూర్తి చేసి, ఎఫ్.టి.ఓ లు జనరెట్ చేసిన వారికి నిధులు ముందస్తుగా విడుదలవుతాయని మంత్రి పేర్కొన్నారు. పాఠశాలలకు అవసరమైన ఫర్నిచర్, గ్రీన్ చాక్ బోర్డ్ వచ్చే వారం జిల్లాలకు వస్తాయని, వాటిని మోడల్ పాఠశాలలకు పంపిణీ చేయాలని మంత్రి ఆదేశించారు.

మోడల్ పాఠశాలలో ఉన్న పాత ఫర్నిచర్ ను తొలగించాలని, బీరువాలకు స్ప్రే పెయింటింగ్ వేయాలని, పాడయిపోయిన ఫర్నీచర్ ను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కండేం చేయాలని అన్నారు.

పాఠశాలల నిర్వహణ కోసం ప్రభుత్వం 130 కోట్లు విడుదల చేసిందని, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తూ పారిశుధ్యం, టాయిలెట్స్ నిర్వహణ లో ఇబ్బందులు రాకుండా కలెక్టర్ లు పర్యవేక్షించాలని మంత్రి కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల ప్రాథమిక పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుకు నిర్ణయించి, అవసరమైన పుస్తకాల కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తున్నామని, ప్రతి జిల్లాలో గ్రంథాలయ ఏర్పాటుకు అనువైన ప్రాథమిక పాఠశాలలను ఎంపిక చేయాలని మంత్రి సూచించారు.

మన ఊరు మన బడికి సంబంధించి మోడల్ పాఠశాలలతో పాటు మిగిలిన పాఠశాలలో సైతం పనులు వేగవంతం చేయాలని, మార్చి చివరి నాటికి మొదటి దశ నూరు శాతం పూర్తి చేయాలని, ఇంజనీరింగ్ అధికారులు నాణ్యత విషయంలో పకడ్బందీగా ఉండాలని మంత్రి తెలిపారు.

టి.ఎస్.ఈ.డబ్ల్యూ.ఐ.డి.సి చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, పాఠశాల పెయింటింగ్ అంశంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని, నిబంధనలు ప్రకారం పకడ్బందీగా పెయింటింగ్ జరిగేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ ఉండాలని, కలెక్టర్ లు ఉన్నతాధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని కోరారు.

30 లక్షల రూపాయల కంటే అధికంగా ఖర్చు జరిగే పాఠశాలలకు టెండర్లు రాని పక్షంలో స్థానిక ఎమ్మెల్యే సహకారంతో నామినేషన్ ద్వారా పనులు ప్రారంభించాలని కోరారు.

సమావేశం అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ సంగీత సత్యనారాయణ సంభందిత అధికారులతో మాట్లాడుతూ, జిల్లాలో 28 మోడల్ పాఠశాలల పెయింటింగ్ డిసెంబర్ 25 నాటికి పూర్తి చేయాలని, డిసెంబర్ చివరి నాటికి ఎన్.ఆర్. ఈ.జి.ఎస్. పనులు పూర్తి చేసి ప్రారంభానికి సన్నద్దం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

జిల్లాలో 18 పాఠశాలలో 30 లక్షల కంటే అధికంగా ప్రతిపాదనలు ఉన్నాయని, వాటిలో టెండర్ రాని వాటికి వెంటనే నామినేషన్ పద్ధతిలో పనులు కేటాయించాలని సూచించారు.

జిల్లాలో మన ఊరు మనబడి కింద పూర్తి చేసిన ప్రతి పనికి సంబంధించి ఎఫ్.టి.ఒలు జనరెట్ చేయాలని, ప్రభుత్వం నిధులను సెంట్రల్ పూలింగ్ విధానం ప్రవేశపెట్టిందని, విధులకు కొరత లేనందున క్షేత్రస్థాయిలో పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి ,ఈఈ పంచాయతీ రాజ్ ముని రాజు, ఈఈ ఆర్ అండ్ బి నరసింహ చారి, మండల విద్యాశాఖ అధికారులు, సంబంధించిన అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
—————————————————
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post