డిసెంబర్ 13, 2005 కంటే ముందు నుండి సాగు చేసే వారిని అర్హులుగా గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం.1 తేది 06-11-2021

డిసెంబర్ 13, 2005 కంటే ముందు నుండి సాగు చేసే వారిని అర్హులుగా గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి


జగిత్యాల, నవంబర్ 06:

డిసెంబర్ 13, 2005 కంటే ముందు నుండి సాగు చేసే వారిని అర్హులుగా గుర్తించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పోడు భూముల సమస్యలను పరిష్కరించడంలో డిసెంబర్ 13, 2005 కంటె ముందు నుండి అటవీ భూములలో సాగుచేస్తున్న వారిని అర్హులుగా గుర్తించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మంటపంలో పోడు భూములలో సాగుచేస్తున్న లబ్దిదారులను అర్.ఎఫ్.ఓ.ఆర్ హక్కు పత్రాలను అటవి భూములపై ఆదారపడే నిరుపేదలనై అర్హులకు అందించాలని, అక్రమణలు జరగకుండా నివారించే దిశగా అధికారులు పనులు చేయాలని, 8 నవంబర్ నుండి ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, అవసరమైతే సోమవారం మల్లి సమావేశం నిర్వహించడం జరుగుతుందని పేర్కోన్నారు.

మొదటి విడతలో పోడు భూముల అక్రమణదారులకు అర్.ఎఫ్.ఒ.ఆర్ చట్టం మొదలకు అంశాలపై అవగాహన కల్పిస్తూ, ప్రతి గ్రామపంచాయితిలో క్షేత్రస్థాయిలో పర్యటించాల్సి ఉంటుందని, 45 గ్రామాలు 2 హబిటేషన్లలోని పోడు సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఫామ్-ఏ జాబితాను అందించడం జరుగుతుందని దానిని సక్రమంగా నమోదు చేయాలని, అన్నిరాజకీయ పార్టిలకు చెందిన ప్రతినిధులతో సమావేశాలను నిర్వహించాలని, జిల్లా, సబ్ డివిజనల్ మరియు మండలం నోడల్ టీం, గ్రామ పంచాయితి లో ఫారెస్ట్ రైజ్ కమీటిలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలియచేశారు.

ఈ కమిటి ప్రతి గ్రామాలను షెడ్యూల్ ప్రకారం మూడు సార్లు పర్యటించి సభ్యులను నియమించడం జరుగుతుందని గ్రామపంచాయితి టీంలో సర్పంచ్, పంచాయితి సెక్రటరి, ఫారెస్ట్ బీట్ అధికారి, డివిజన్ రేజ్ అధికారి మరియు విలేజ్ రెవెన్యు అధికారులతో గ్రామపంచాయితి టీంను రూపోందించడం జరుగుతుందని పేర్కోన్నారు. హబిటేషన్ లో కూడా ఇదే టీం ఉంటుందని, ఫారెస్ట్ రైడ్ కమీటిలో అవగాహన కల్పిస్తూ, మండలం నుండి గ్రామంలో ఉన్న అటవి భూమి ప్రకారం లబ్దిదారులు ప్రకారం పంచాయితి సెక్రటరి వాటిని పూర్తిచేయాలని, గ్రామ సభ నిర్వహించి, సభద్వారానే ప్రజల్లో అవగాహన కల్పించాలని, FRC ని ఎన్నుకుంటారని, గ్రామసభులో 50శాతం కంటే ఎక్కువగా ఉండేలా చూడాలని, ప్రతి కమిటిలో 10 నుండి 15 మంది సభ్యులను ఎన్నుకొవాలని అందులో 2/3 ఎస్టీ, 4 గురు ఎస్టి మహిళా సభ్యులు ఉండేలా చూడాలని, ఎస్టి లు లేనట్లయితే, 15 మంది సభ్యులలో 5గురి కంటే తక్కువ కాకుండా మహిళల ఉండేలాని తరువాత ఇతరులను నియమించాలని సూచించారు.

గ్రామంలో ఎస్టిలు ఉన్నట్లయితే 10 మంది ఎస్టీలు ఉండాలని ఇతరులు ఎవరైన ఉండవచ్చని, పూర్తిగా ఎస్టి గ్రామం అయినట్లయితే కమిటి సభ్యులు పూర్తిగా ఎస్టిలను నియమించుకోవచ్చని పేర్కోన్నారు. చైర్పర్సన్, సెక్రటరిని ఎన్నుకోవాలని అన్నారు. గ్రామం లేదా హబిటేషన్లలో సాగుచేస్తున్నది క్షేత్ర స్థాయిలో తెలుసుకోవాలని. మ్యాప్ ప్రకారం నిర్దారించుకోవాలని, మండల టీం తహసీల్దార్, ఎంపిడిఓ, రేంజ్ అధికారులతొ మండల స్థాయి కమీటిలను రూపొందించడం జరుగుతుందని పేర్కోన్నారు. వీరు గ్రామ పంచాయితి కమిటి సభ్యుల పనితీరును సమీక్షించాల్సి ఉంటుందని పేర్కోన్నారు.

ప్రతి 3 మూడు మండలాలకు ఒక డిప్యూటి ఇన్స్పెక్టర్, ఒక ఎడి సర్వే శాఖ నుండి కేటాయించడం జరుగుతుందని పేర్కోన్నారు. కమీటిలో అనుభవం గల జిల్లా, మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్ నియమిస్తారని, ప్రతిరోజు పనులను పర్యవేక్షించడం జరుగుతుందని, జిల్లా కంట్రోల్ రూం ఏర్పాటు చేయడం జరుగుతుందని, అటవి, రెవెన్యు, పంచాయితి అధికారులను నియమించడం జరుగుతుందని పేర్కోన్నారు. ఫాంలను నింపడంలో మద్యవర్తులు ప్రజలను మోసం చేయాడానికి ఆస్కారం లేకుండా చుడాలని, 13 డిసెంబర్ 2005 కంటే మందు నుండి వ్యవసాయం చేసే వారు మాత్రమే అర్హులుగా గుర్తించాలని, ఎస్సిలు కాని వారు వ్యవసాయం చేసేవారు సుమారు 75 సంవత్సరాల నుండి అటవి ప్రాంతంలో ఉంటు అడవిపై ఆదారపడి నివసించే వారిని మాత్రమే గుర్తించాలని, సరైన పత్రాల ఆధారంగా గాని లేదా గ్రామంలో నివాసం ఉండే వారి ద్వారా వ్రాతపూర్వకంగా ఇచ్చే దృవీకరణల ఆధారంగా లబ్దిదారులను గుర్తించాలని పేర్కోన్నారు.

ఫారెస్ట్ రైడ్ కమిటి, జిల్లా మరియు సబ్ డివిజనల్ స్థాయి కమీటీలు పనిచేయడం జరగుతుందని ఈ టీంల క్రింద మండల, గ్రామ స్థాయి కమిటీలు సపోర్టింగ్ టీంలుగా పనిచేస్తాయని పేర్కోన్నారు. జట్పిటిసి సభ్యులను జిల్లా స్థాయిలో నియమించడం జరుగుతుందని అందులో ముగ్గురిలో ఇద్దరు ఎస్టీలు ఉంటారని, ఆర్డిఓ, ఎఫ్.ఆర్.ఓ, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి గాని అసిస్టేంట్ ట్రైబల్ వెల్ఫెర్ అధికారులు ఉంటారని, యంపిటిసి 3 సబ్ డివిజన్ కమిటిలో నియమించడం జరుగుతుందని తెలియచేసారు.

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డి.ఎఫ్.ఓ., అటవీ, రెవెన్యూ, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు , సిబ్బంది తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి జగిత్యాల చే జారీ చేయనైనది.

Share This Post