డిసెంబర్ 14 నుంచి రెండు పడక గదుల ఇండ్ల వరుస గృహ ప్రవేశాలు:జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంత రావు

డిసెంబర్ 14 నుంచి రెండు పడక గదుల ఇండ్ల వరుస గృహ ప్రవేశాలు

– ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను ప్రారంభోత్సవాలకు సర్వ సన్నద్ధం చేయాలి

– పెండింగ్ పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి

-జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంత రావు
——————————-
సిద్దిపేట 30, నవంబర్ 2021: ——————————-
డిసెంబర్ 14 నుంచి సిద్దిపేట జిల్లాలో అన్ని విధాలుగా పూర్తయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేసి గృహ ప్రవేశాలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీ ఎం హనుమంత రావు తెలిపారు.
జిల్లాలో గ్రామాలు, పట్టణాల వారీగా ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇండ్లను ప్రారంభోత్సవాలకు సర్వ సన్నద్ధం చేయాలనీ జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

మంగళవారం IDOC లోని తన ఛాంబర్ లో డబుల్ బెడ్ రూం ఇండ్ల గృహ ప్రవేశాల ఏర్పాట్ల పై సంబంధిత ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

జిల్లాలో గజ్వేల్ పట్టణంలో 1250, దుబ్బాక పట్టణం లో 852, దుబ్బాక రూరల్ లో 400, దౌల్తాబాద్ మండలంలో 170, రాయపోల్ మండలంలో 145, మిరుదొడ్డి మండలంలో 185, తోగుట మండలంలో 80, బెజ్జంకి మండలంలో 98, హుస్నాబాద్ లో 160 డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు.

డబుల్ బెడ్ రూం ఇండ్ల కు సంబంధించి లబ్దిదారుల ఎంపిక బాధ్యతను తాము తీసుకుంటామని తెలిపారు.

బిగ్ డేటా ఆధారంగా దరఖాస్తు దారులను వడపోసి, క్షేత్ర స్థాయి విచారణ అనంతరం ఇండ్లు లేని నిరుపేదలను మాత్రమే పారదర్శకంగా లబ్ధిదారులుగా ఎంపిక చేస్తామని అన్నారు.

ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కాలనీల లో అంతర్గత రోడ్లు, ఎలక్ట్రిసిటీ, త్రాగునీరు వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి రెడీగా చూసుకోవాలనీ జిల్లా కలెక్టర్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.

సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీ ముజమిల్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, R&B, PR, EWIDC ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు .

——————————
డీ.పీ.ఆర్.ఓ, సిద్ధిపేట కార్యాలయంచే జారీ చేయనైనది.

Share This Post