డిసెంబర్ 15నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి

డిసెంబర్ 15నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి

 

బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలను బడిలో చేర్చాలి

 

స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0 0 0 0

 

         

 

     మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి మండలం లో రెండు పాఠశాలను డిసెంబర్ 15 నాటికి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తెలిపారు.

 

           బుదవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ, యంపిడిఓలు, యంఈఓలు మరియు డిప్యూటి ఏఈలు,పేయింట్ ఎజేన్సి లతో మన ఊరు మన బడి, తొలిమెట్టు మరియు బడిబాట కార్యక్రమాల పై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సమావేశాన్ని నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి, తొలిమెట్టు కార్యక్రమం ద్వారా చేపడుతున్న పాఠశాలల పునరుద్దరణలో నాణ్యత ప్రమాణాల పాటించి జిల్లాలోని 230 పాఠశాలల్లో మండలానికి  రెండు పాఠశాలల చోప్పున అన్ని పాఠశాలల్లో విద్యూత్, మంచినీరు, ఫర్నీచర్ మరియు డిజిటలైజేషన్ మొదలగు వాటిని సమకూర్చి మోడల్ పాఠశాలలుగా అభివృద్ది చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతి తరగతి గదిలో రన్నింగ్ బ్లాక్ బోర్డులను ఏర్పాటు చేయాలని,  కిచేన్ షెడ్ లు, టాయిలెట్లు లను ఏర్పాటు చేయాలని, ప్రతి తరగతి గదిలో వాల్ పుట్టిని, పెయింటింగ్ పనులను చేపట్టాలని, పాఠశాలల్లో విద్యూత్ సౌకర్యాన్ని కల్పించాలని, ఫర్నిచర్, డిజిటలైజేషన్ విధానం అమలు చేయాలని, సానిటేషన్ పనులు సక్రమంగా జరిగేలా చూడాలని మరియు విద్యార్థులతో పాటు ఉపాద్యాయుల కొరకు మంచినీటిని సౌకర్యాన్ని తప్పక సమకూర్చాలని పేర్కోన్నారు.  ప్రతి మూడవ శనివారం విద్యార్థుల తల్లితండ్రులతో పేరెంట్ మీటింగ్ ను పండుగ వాతావరణంలో ఏర్పాటు చేయాలన్నారు.  బడిబాట కార్యక్రమాన్ని ప్రతి నెల 1వ తేదినాడు నిర్వహించి బడీడు పిల్లలను బడిలో చేర్చాలని, బడిలో పిల్లల నమోదు పెంచాలని సూచించారు.

 

          ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రావు, డిఆర్డిఒ శ్రీలతా రెడ్డి,  ఎంపిడిఓలు, యంఈఓలు, డిప్యూటి ఈఈలు ,  ఏఈలు మరియు పేయిటింగ్ ఎజేన్సిల ప్రతినిధులు పాల్గోన్నారు.

Share This Post