డిసెంబర్ 2, 12 వ తేదీల్లో సదరం శిబిరం :: డీఆర్డీఓ కె. కౌటిల్య

రాజన్న సిరిసిల్ల, నవంబర్ 27: ఈ డిసెంబర్ 2 (గురువారం), 12 (గురువారం) తేదీల్లో సిరిసిల్లలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో సదరం శిబిరం నిర్వహించనున్నట్లు డిఆర్డీఓ కె. కౌటిల్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో శారీరక వైకల్య నిర్ధారణ పరీక్షలు (ఆర్థోపెడిక్) చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. మీ సేవలో ఆన్లైన్ స్లాట్ బుక్ చేసుకుని ఆ రశీదుతో పాటు, ఆధార్ కార్డు, ఫోటో, మెడికల్ రిపోర్ట్ జిరాక్స్ కాపీలతో పైన పేర్కొన్న తేదీల్లో శిబిరానికి రావాలని డిఆర్డీఓ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Share This Post