Press release
కలెక్టరేట్
*డిసెంబర్ 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం*
**అన్ని వర్గాల ప్రజలు, యువత తమ ఓటును నమోదు చేసుకోవాలి
**ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన, స్వచ్చంద, స్వయం సహాయక సంఘ ప్రతినిధులు ఓటర్ గా నమోదు చేసుకోని వారిని గుర్తించి నమోదు చేయుటకు సహకరించాలి
**www.nvsp.in, ceo.telangana.nic.in వెబ్సైట్ ద్వారా, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఆన్లైన్ లో నమోదుకు అవకాశం*
*ఫారం-6 నింపి క్రొత్త ఓటరుగా నమోదు, 6బి తో ఆధార్ లింక్ చేసుకోవాలి
*ఫారం -8 నింపి ఓటర్ కార్డ్ లో మార్పులు, సవరణలు చేసుకోవాలి*
*చేర్పులు, మార్పులపై రాజకీయ పార్టీ ప్రతినిధులు అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలి*
**ఓటరు నమోదు, అభ్యంతరాలను డిసెంబర్ 26 లోగా పరిశీలన*
**2023 జనవరి 5న తుది ఓటర్ జాబితా ప్రకటన*
*hanumakonda డిసెంబర్ -02
డిసెంబర్ 3, 4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో బూత్ స్థాయి అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించు ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు నేడోక ప్రకటనలో తెలిపారు.
ప్రజా స్వామ్యం లో ఓటు హక్కు వజ్రయుధం అని, అన్ని వర్గాల ప్రజలు, యువత తమ ఓటు హక్కును నమోదు చేయడంతో పాటు కుటుంబ సభ్యుల, చుట్టు ప్రక్కల ఉన్న వారి ఓటరు పేరును జాబితాలో నమోదు అయ్యేలా చూడాలని తెలిపారు.
ప్రజా ప్రతినిధులు, అధికారులు, యువజన, స్వచ్చంద, స్వయం సహాయక సంఘ ప్రతినిధులు తమ పరిధిలో ఎవరైనా ఓటర్ గా నమోదు చేసుకోని వారిని గుర్తించి వారి పేరు నమోదు చేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
www.nvsp.in, ceo.telangana.nic.in వెబ్సైట్ ద్వారా, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా ఆన్లైన్ లో నమోదుకు అవకాశం కల్పించడం జరిగిందని, ఫారం-6 నింపి క్రొత్త ఓటరుగా నమోదు, 6బి తో ఆధార్ లింక్ చేసుకోవాలని, ఫారం -8 నింపి ఓటర్ కార్డ్ లో మార్పులు, సవరణలు చేసుకోవాలని సూచించారు.
చేర్పులు, మార్పులపై రాజకీయ పార్టీ ప్రతినిధులు అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలని, ఓటరు నమోదు, అభ్యంతరాలను డిసెంబర్ 26 లోగా పరిశీలన చేసి 2023 జనవరి 5న తుది ఓటర్ జాబితా ప్రకటన చేయడం జరుగుతుందని తెలిపారు.
జిల్లా లో పట్టణ ఓట్ పై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేయాలనీ తెలిపారు.
రెండు రోజుల ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని అర్హత గల ప్రతి ఒక్కరూ తమ పేరును ఓటర్ జాబితాలో నమోదు చేసుకోవాలని కలెక్టర్ అట్టి ప్రకటన లో వెల్లడించారు.