డిసెంబర్ 30 లోగా పి.ఓ 2018 ఉద్యోగుల ప్రక్రియ పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 24-12-2021
డిసెంబర్ 30 లోగా పి.ఓ 2018 ఉద్యోగుల ప్రక్రియ పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 24:
పి.ఓ 2018 ఉత్తర్వులు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిల్లాస్థాయి సిబ్బంది కేటాయింపుల ప్రక్రియ డిసెంబర్ 30 లోగా ప్రక్రియ పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను అదేశించారు. శుక్రవారం ఉధయం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో పి.ఓ 2018 కేటాయింపుల ప్రక్రియపై జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పి.ఓ 2018 ఉత్తర్వులు ప్రకారం ప్రభుత్వం జారిచేసిన జి.ఓ 317 ననుసరించి జిల్లా నుండి బదిలి లేదా జిల్లాకు కేటాయించబడిన జిల్లా క్యాడర్ సిబ్బందికి డ్యూటి కేటాయించి విధులలో చేరే ప్రక్రియ డిసెంబర్ 30 లోగా పూర్తయి, జనవరి 1, 2022 నుండి కొత్త సిబ్బంది పూర్తిస్థాయి విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అన్నారు. అన్నిశాఖల అధికారులు జిల్లా నుండి బదిలిపై వెళ్లెవారి సంఖ్య, వచ్చే వారి సంఖ్య ఆదారంగా సీనియారిటి జాబితాను రూపొందించాలని, బదిలి కాకుండా ప్రస్తుతం ఈ జిల్లాలొనే విధులు నిర్వహించే వారి స్థానాలను మినహంచాలని, చాలా వరకు ఇక్కడి నుండి వెళ్లిన వారి స్థానాలలో కొత్తవారిని కేటాయించడం జరిగినందున వారికి విధులలో చేర్చుకోవాలని, సిబ్బంది ఎక్కువగా ఉండే మెడికల్, పోలీస్, విద్యా శాఖలలో ప్రాదాన్యత క్రమంలో సిబ్బందికి డ్యూటీలను కేటాయించవలసి ఉంటుందని. అందుకనుగునంగా వారికి పోస్టింగ్ లను నిర్దారించడానికి జిల్లాస్థాయిలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్, సిపిఓ, జిల్లా కోశాధికారి (డిటిఓ), ఆర్డిఓలతో జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుందని, అన్ని శాఖల అధికారులు వారి కార్యాలయం వారిగా జిల్లా నుండి బదిలిపై వెళ్లె వారి, వచ్చే వారి సంఖ్యతో పాటు ప్రాదాన్యత ఉన్న వాటి గురించిన నివేధికను జిల్లా కమిటికి అందించాల్సి ఉంటుందని పేర్కోన్నారు.
మొదటగా జిల్లానుండి వెళ్లిన వారికి సమానంగా వచ్చేవారిని కేటాయించి, అనంతరం మిగిలిన స్థానాలను ప్రాదాన్యత క్రమంలో సినియారిటి ఆదారంగా వారిని డ్యూటి అలాట్ చేయడం జరుగుతుందని తెలియచేసారు.
సిబ్బంది నుండి ఈనెల 26, 27 తేదిల నుండి జిల్లాకు కేటాయించిన సిబ్బందిన నుండి వారి ప్రాధాన్యత లను స్వీకరించడం జరుగుతుందని, అనంతరం 28, 29 తేదిలలో జిల్లా కమిటి సిబ్బందికి కేటాయింపులు ప్రక్రియ పూర్తిచేయాలని, కమిటి ఆదేశాల మేరకు జిల్లాస్థాయి సిబ్బంది డిసెంబర్ 30 లోగా విధులలో చేరి, జనవరి 1 నుండి పూర్తిస్థాయి విధులు నిర్వహించాలని అన్నారు.

డిసెంబర్ 30 లోగా పి.ఓ 2018 ఉద్యోగుల ప్రక్రియ పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post