డిసెంబర్ 7న జాబ్ మేళా

 

డిసెంబర్ 7న జాబ్ మేళా

జిల్లా ఉపాధి శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 7న జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి శ్రీమతి ఎ.వందన సోమవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

బజాజ్ అలియాజ్ కంపెనీలో 500 ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్స్,1500 ఇన్సూరెన్స్ కన్సల్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఇట్టి ఉద్యోగాలకు ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత కలిగి ఉండి, వయస్సు 22 నుండి 65 సంవత్సరాల లోపు ఉండాలని, సేల్స్ లో ఒక సంవత్సరము అనుభవము గలవారు అర్హులని తెలిపారు.

ఏజెన్సీ సేల్స్ ఆఫీసర్ వేతనం 18 వేల నుండి 50 వేల వరకు ఉంటుందని, ఇన్సూరెన్స్ కన్సల్టెంట్
వేతనం 10 వేల నుండి 20 వేలు ఉంటుందని, ఇంటి నుండి(వర్క్ ఫ్రొం హోమ్) పని చేయాల్సి ఉంటుందని ఆమె పేర్కొన్నారు.

ఆసక్తి అర్హత గల నిరుద్యోగులు ఈనెల 7న (మంగళవారం ) ఉదయం 10:30 గంటలకు బైపాస్ రోడ్డులో గల పాత వెలుగు ఆఫీస్ ప్రాంగణంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో జరుగు జాబ్ మేళాకు నేరుగా హాజరుకావాలని ఆమె సూచించారు.

Share This Post