డిసెంబర్,31 వరకు జిల్లాలో 100 శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులను ఆదేశించారు

డిసెంబర్,31 వరకు జిల్లాలో 100 శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులను ఆదేశించారు

డిసెంబర్,31 వరకు జిల్లాలో 100 శాంతం వాక్సినేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిఖిల వైద్య అధికారులను ఆదేశించారు.

ఈరోజు కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో వైద్య అధికారులతో వాక్సినేషన్ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోజుకు 30 వేల చొప్పున వాక్సినేషన్ చేసి లక్ష్యం పూర్తి చేయాలన్నారు. 2వ డోజ్ వాక్సినేషన్ 30 శాంతం మాత్రమే అయినందున కలెక్టర్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు మొదటి డోజ్ 6,41,253 మందికి వేసి 90 శాంతం లక్ష్యం పూర్తి కాగా, రెండవ డోజ్ 2,07,781 మందికి వేసి 30 శాంతం లక్ష్యం మాత్రమే పూర్తి చేయబడిందన్నారు. PHC ల వారిగా ప్రతి ఒక్కరు నిర్దేశించిన లక్ష్యాన్ని ఈ మసాంతం వరకు పూర్తి చేయాలని వైద్య అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అంతకుముందు ఏరియా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన డ్రోన్ ద్వారా మందుల సరఫరాల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ అత్యవసర మందులను అతి వేగంగా చేరవేసేందుకు దేశంలోనే మొదటి సరిగా వికారాబాద్ జిల్లాలో డ్రోన్ లను వినియోగించడం జరుగుతుందన్నారు. గంట వ్యవధిలో అయ్యే పనిని డ్రోన్ ద్వారా పది నిముషాలలో చేయడం జరుగుతుందన్నారు.
ఈరోజు సిద్దులూర్ నుండి శాంపిల్స్ ను వికారాబాద్ కు డ్రోన్ ద్వారా పంపగా, అదే డ్రోన్ ద్వారా సిద్దులుర్ కు వాక్సిన్లు, మందులను పది నిమిషములలో పంపడం జరిగిందన్నారు. ఈ డ్రోన్ ద్వారా జిల్లాలో 50 కిలోమీటర్లు పరిధిలో ఇట్టి అత్యవసర సేవలు వినియోగించుకోవాడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య, జిల్లా వైద్య అధికారి తుకారం, ఉప వైద్య అధికారి జీవరాజ్, డా. అరవింద్ అన్ని మండలాల వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post