డి.ఆర్.డి.ఎ, ఈ.జీ.ఎం.ఎం. ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ కార్యక్రమం ప్రారంభo : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన తేది:17.9.2021.
వనపర్తి.
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు అనేక కార్యక్రమాల ద్వారా ఉచిత శిక్షణ ఏర్పాటు చేస్తున్నదని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సూచించారు.
శుక్రవారం వనపర్తి జిల్లాలోని వై.టి.సి. బిల్డింగ్ లో డి.ఆర్.డి.ఎ, ఈ.జీ.ఎం.ఎం. ద్వారా,ఈ.డబ్ల్యూ.ఆర్. సి. శిక్షణ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ EWEC (English Work Readiness Computer) లో భాగంగా 33 మంది నిరుద్యోగులతో ఈ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ శిక్షణ కార్య క్రమంలో విద్యార్థులకు కంప్యూటర్, ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, రిపేర్ లలో 90 రోజుల శిక్షణ ఉంటుందని జిల్లా కలెక్టర్ సూచించారు.
శిక్షణ అనంతరం వారికి వివిధ ప్రైవేటు కంపెనీలలో ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుందని ఆమె అన్నారు. జిల్లాలోని నిరుద్యోగులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఉపాధి పొందాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ నరసింహులు, జిల్లా ఉపాధి కల్పన అధికారి అనిల్ కుమార్, డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
…………..
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post