డి ఆర్ సిసి లను బలోపేతం చేయండి: అర్బన్ జిల్లా కలెక్టర్, రాజీవ్ గాంధీ హనుమంతు క్షేత్ర స్థాయిలో పొడి వనరుల సేకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ప్రెస్ రిలీజ్
వరంగల్ అర్బన్.
తేది.29 జులై 2021

డి ఆర్ సిసి లను బలోపేతం చేయండి: అర్బన్ జిల్లా కలెక్టర్, రాజీవ్ గాంధీ హనుమంతు

క్షేత్ర స్థాయిలో పొడి వనరుల సేకరణ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

కొత్తగా నిర్మించిన
అంతర్గత రోడ్ల పరిశీలన…

నగరంలో నిర్వహిస్తున్న
డి ఆర్ సిసి లను మరింత బలోపేతం చేయాలని అర్బన్ జిల్లా కలెక్టర్, ఇంచార్జి కమిషనర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదేశించారు. గురువారం ఆయన
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, ఐటీసీ-వావ్ మరియు ఈ శ్రీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో సుబేదారి, పోతన నగర్ కేంద్రాల్లో నిర్వహిస్తున్న పొడి వనరుల సేకరణ కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి నిర్వహణ తీరును పరిశీలించారు.
గ్రేటర్ వ్యాప్తంగా ఉన్న 25 డి ఆర్ సి కేంద్రాలను సమర్ధంగా నిర్వహించాలని అన్నారు. డి ఆర్ సి కేంద్రాలలో షెడ్ లు వెంటనే ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతి నెల ఎంత పొడి చెత్త వస్తుందో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మొత్తంలో పొడి చెత్తని సేకరించాలని కోరారు. అలాగే అర్బన్ జిల్లా పరిధిలోని గ్రామాలలో పల్లె ప్రకృతి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన పొడి వనరుల సేకరణ కేంద్రాల నుండి కూడ పొడి చెత్తని సేకరించవలసింది గా ఐటీసీ వావ్ సిబ్బందిని ఆయన ఆదేశించారు.

అనంతరం పలు డివిజన్లలో నిర్మించిన అంతర్గత సిసి రోడ్లు, డ్రైన్ లను పరిశీలించారు. ముందుగా 57 డివిజన్ లోని సమ్మయ్య నగర్లో 60వ డివిజన్ లోని టీచర్స్ కాలనీ ఫేస్2లో , 61వ డివిజంలోనిని ప్రశాంత్ నగర్, సిద్దార్థ నగర్, 65 వ డివిజన్ లోని చింతగట్టు ప్రాంతాలల్లో నిర్మించిన అంతర్గత రహదారులు , ముయూగుకాలువ ను పరిశీలించారు. పనులు నిబంధనల మేరకు నాన్యతతో ఉంటేనే బిల్లులు చెల్లించడం జరుగుతుందని లేనిచో బిల్లులో కోత విదిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బల్దియా ఎస్ ఈ సత్యనారాయణ, CMOH డా,రాజారెడ్డి, ఈఈ శ్రీనివాస్, లక్ష్మారెడ్డి, డీఈ లు రాసి కిరణ్, రవి కుమార్, ఏ ఈ రంజిత్ సానిటరీ సూపర్ వైజర్ నరేందర్ సానిటరీ ఇన్స్పెక్టర్ గోల్కొండ శ్రీను, ఐటీసీ వావ్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్స్ కిరణ్,పవన్, జవాన్లు మరియు డి ఆర్ సి సి ఆపరేటర్స్ పాల్గొన్నారు.

Share This Post