డీగ్రీ మరియు పీజీ విద్యార్థుల వ్యాక్సినేషన్ పై సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం—-1
డీగ్రీ,పి. జి.విద్యార్థులందరికీ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి::జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
రేపటి వరకు వ్యాక్సినేషన్ కాని విద్యార్థులు, ఉపాధ్యాయుల జాబితా సిద్ధం చేయాలి
ప్రభుత్వ మరియు ప్రైవేటు డీగ్రీ కాలెజ్ లలో ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాల ఏర్పాటు
డిగ్రీ విద్యార్థులు/పి.జి. విద్యార్థులు వ్యాక్సినేషన్ పై జూం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి,సెప్టెంబరు 6:-
జిల్లాలో డీగ్రీ విద్యార్థులు మరియు టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పూర్తి స్థాయిలో వ్యాక్సినేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ తెలిపారు.
డిగ్రీ విద్యార్థులు / పి.జి. విద్యార్థులు వ్యాక్సినేషన్ పై సోమవారం జిల్లా కలెక్టర్ డీగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ లతో జూం ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ ప్రిన్సిపాల్స్, యాజమానులతో విద్యార్థులకు అందించే కోవిడ్ వ్యాక్సినేషన్ పై కాలేజీల వారీగా సమీక్షించారు. విద్యార్ధులందరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరచాలని, ప్రతి విద్యార్థినీ విద్యార్థికి వ్యాక్సినేషన్ అందించాలని, అలాగే కొత్తగా వచ్చే విద్యార్థులను కూడా పరిగణలోకి తీసుకోవాలని, అదే విధంగా అధ్యాపకులు, సిబ్బంది కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ పొంది ఉండాలని ఆదేశించారు. వ్యాక్సిన్ తీసుకోని విద్యార్థుల వివరాలను రేపటి వరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారికి అందించాలని సూచించారు విద్యార్థుల వివరాలను బట్టి జిల్లా వైద్య ఆరోగ్య శాఖచే వ్యాక్సినేషన్ అందించడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ కార్యక్రమానికి కాలేజీలలో ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రేపటి నుండి ప్రతి ప్రభుత్వ మరియు ప్రైవేటు డిగ్రీ కళాశాలలో వ్యాక్సినేషన్ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు విద్యార్థులకు మాత్రమే కాకుండా కళాశాలలో పని చేసే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ వివరాలు సైతం అందించాలని తెలిపారు. రేపు ఉదయం11 గంటల వరకు డీగ్రీ కళాశాలలకు వైద్య బృందాలు చేరుకోవాలని, పరీక్ష ప్రారంభించడానికి ముందు విద్యార్థులకు వ్యాక్సిన్ కేంద్ర ఏర్పాటు పై సమాచారం అందించాలని కలెక్టర్ సూచించారు. సెప్టెంబర్ 9 వరకు డీగ్రీ కళాశాలలో విద్యార్థులు, స్టాఫ్ అందరికీ వ్యాక్సిన్ అందించి,కళాశాల ప్రాంగణంలో వ్యాక్సినేషన్ పూర్తి అయిందని ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ కృపాబాయి, కళాశాల ప్రిన్సిపాల్ లు, తదితరులు ఈ జూమ్ కాన్ఫరెన్స్ లో హాజరయ్యారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి పెద్దపల్లిచే జారీ చేయనైనది.

Share This Post