డెంగీ కేసులు పెరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి : మంత్రి శ్రీ కే తారక రామారావు

డెంగీ కేసులు పెరగకుండా అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోండి : మంత్రి శ్రీ కే తారక రామారావు

——————————-
సిరిసిల్ల 22, జూలై 2022
——————————-
జిల్లాలో డెంగీ కేసులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు, మున్సిపల్ , పంచాయితి అధికారులకు రాష్ట్ర ఐటీ పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కే తారక రామారావు సూచించారు.

శుక్రవారం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా, డెంగ్యూ, టైపాయిడ్ సహా కీటకజనిత వ్యాధులు రాకుండా చూసేందుకు తీసుకోవాల్సిన చర్యల పై మంత్రి మున్సిపల్ , పంచాయితీ అధికారులతో కలెక్టరేట్ లో సమావేశం నిర్వహించారు.

జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ ఎన్ అరుణ, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, జిల్లా అదనపు కలెక్టర్ లు బి సత్య ప్రసాద్, ఖీమ్యా నాయక్, ఆర్డీఓ టి శ్రీనివాస్ రావు, జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుమన్ మోహన్, సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, సమ్మయ్య, టౌన్ ప్లానింగ్ అధికారి అన్సారీ తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో 14 డెంగీ కేసులు నమోదు అయ్యాయని జిల్లా కలెక్టర్ మంత్రి దృష్టి తీసుకువచ్చారు. డెంగీ కేసులు నమోదైన చోట వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. డెంగీ సహా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లాలో కోవిడ్ కేసుల గురించి, బూస్టర్ డోస్ గురించి మంత్రి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ప్రశ్నించగా ప్రసుతం జిల్లాలో 50 కేసులు ఆక్టివ్ లో ఉన్నాయని తెలిపారు. అందరూ స్వల్ప జ్వర లక్షణాలతో మాత్రమే బాధ పడుతున్నారని అన్నారు.
వ్యాధి వ్యాప్తి నీ అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకూ 11 వేల మందికి బూస్టర్ లు ఇచ్చామని అన్నారు. 50 వేల డోస్ లు సిద్దంగా ఉన్నాయనీ తెలిపారు.
మిగతా వారికి సాధ్యమైనంత త్వరగా బూస్టర్ డోస్ ఇస్తామని తెలిపారు. ఆరోగ్యశ్రీ లో డెంగ్యూ కు ట్రీట్ మెంట్ ఉన్నందున ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. టి హబ్ తో సహా అన్ని phc ఆసుపత్రులలో ఉ సీబీపీ మిషన్ లు అందుబాటులో ఉన్నందున ప్లేట్ లేట్ ల సంఖ్యను గమనిస్తూ.. వ్యాధికి చికిత్స అందించాలి అన్నారు. బాధితులకు రక్తం కొరత రాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టీ రక్త నిధి కేంద్రంలో సరిపడా రక్తం అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…
వర్షాకాలం ముగిసే వరకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ , పంచాయితి రాజ్ అధికారులు హై అలెర్ట్ గా ఉండాలన్నారు.
డెంగ్యూ కేసులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.క్రమం తప్పకుండా పారిశుద్ధ్య కార్యక్రమాలతో పాటు డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలన్నారు.
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బూస్టర్ డోసు వ్యాక్సినేషన్‌‌‌‌ను స్పీడప్ చేయాలని మంత్రి సూచించారు.
వైద్య సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని, పంచాయతీ రాజ్ మున్సిపల్ తదితర శాఖలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో, స్థానిక ప్రజా ప్రజా ప్రతినిధుల సహకారం తీసుకోవాలని సూచించారు
మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, డయేరియా తదితర రోగాల పట్ల అవగాహన పెంచాలని అన్నారు.జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలున్న వారికి వెంటనే టెస్టులు చేసి, వీలైనంత త్వరగా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ ప్రారంభించాలన్నారు.
సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలో నిర్మించాల్సిన మోరీలు, రోడ్లు ఉంటే వెంటనే ప్రపోజల్ సిద్ధం చేసి తనకు పంపాలని మున్సిపల్ అధికారులను మంత్రి ఆదేశించారు. కౌన్సిలర్ ల విజ్ఞప్తి మేరకు 37 రకాల పనులను చేపట్టేందుకు రూ.5 కోట్ల నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.
మున్సిపల్ కౌన్సిల్ సమావేశాలు అర్థవంతంగా జరిగేలా చూడాలన్నారు.

*బతుకమ్మ తెప్పే వద్ద అన్ని సౌలత్ లు కల్పించాలి*
సిరిసిల్ల పట్టణంలోని మానేరు నదిని ఆనుకొని ఉన్న బతుకమ్మ తెప్ప వద్ద అన్ని రకాల సౌలత్ లు కల్పించాలని మంత్రి మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
నూతనంగా నిర్మించిన అర్బన్ పార్కు ను ప్రజల్లోకి వెళ్లే గొప్పగా ప్రచారం కల్పించాలని మంత్రి స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులకు సూచించారు. వన భోజనాలను కూడా అక్కడే చేసేలా చూడాలన్నారు.
ఎల్ వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ను త్వరలోనే ప్రారంభిస్తానని మంత్రి తెలిపారు.

*ఇదే ఒరవడి కొనసాగించండి*
రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసుపత్రికి వరుసగా మూడుసార్లు కాయకల్ప అవార్డు రావడం, అదేవిధంగా వేములవాడ ఏరియా ఆసుపత్రి తెలంగాణ లోని ఏరియా ఆసుపత్రి కేటగిరీ లో ప్రథమ స్థానంలో నిలిచి కాయకల్ప అవార్డ్ రావడం పట్ల మంత్రి హర్ష వ్యక్తం చేశారు వైద్యులు, పారామెడికల్ సిబ్బంది శానిటేషన్ వర్కర్స్ కు అందరికీ అభినందనలు తెలిపారు. ఈ హెల్త్ ప్రొఫైల్ ప్రాజెక్టు పూర్తికి కూడా ఏఎన్ఎంలు విశేష కృషి చేశారని కొనియాడారు. ఇదే ఒరవడితో పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు రావాలని కోరారు.

*ఉత్తమ అంగన్వాడీ లు, ANM లకు* *మెమెంటో,ప్రశంసాపత్రం అందించిన మంత్రి*

పోషణ్ అభియాన్ లో భాగంగా అంగన్వాడి టీచర్స్ వారి వారి సెంటర్ పరిధి లో గల గర్బవతులు, బాలింతలు, మరియు పిల్లల ఎదుగుదలకు సంబందించిన వివరాలను మరియు రక్త హీనత గల వారి వివరాలు ఎప్పటికప్పుడు పోషణ్ ట్రాకర్ (ఆన్లైన్) నందు నమోదు చేస్తూ అంగన్వాడి సేవలను ప్రతి ఒక్కరికి అందించినటువంటి ముగ్గురు అంగన్వాడి టీచర్స్ అల్లే సునీత- మామిడిపల్లి –(3)అంగన్వాడి సెంటర్, కొలిపాక వాణిశ్రీ, లింగంపల్లి అంగన్వాడి సెంటర్, N.స్వప్న- గోపాల్ రావుపల్లి లకు ప్రశంసా పత్రాలను మంత్రి అందించి అభినందించారు.

అలాగే క్షేత్ర స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందించిన ANM లు బి ప్రమీల, కే పద్మ, ఈ భూ లక్ష్మి, జే అమృతవల్లి, పి పుష్పలత, G. లలిత ల ను కూడా మంత్రి మెమెంటో,ప్రశంసాపత్రం అందించి అభినందించారు.

Share This Post